మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో సినిమా లు ఇప్పటికే అతడు మరియు ఖలేజా అంటూ రెండు వచ్చాయి.ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా కూడా కలెక్షన్స్ మాత్రం నమోదు చేయలేదు.
ముఖ్యంగా ఖలేజా సినిమా బాక్సాఫీస్ వద్ద మరీ దారుణంగా నిరాశ పర్చింది.ఆ సినిమా ఏ స్థాయి లో అంచనాలు పెంచిందో అంతే దారుణ స్థితిలో వసూళ్లు నమోదు చేసింది.
సినిమా చేసిన బిజినెస్ లో కనీసం 25 శాతం కూడా వసూళ్లు చేయలేక పోయింది అంటూ వార్తలు వచ్చాయి.మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబోలో రెండు సినిమా లు ఫ్లాప్ అయినా కూడా మూడవ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.
దాదాపుగా పుష్కర కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కింది.ఇప్పటికే సినిమా యొక్క మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది.
దాదాపు ఏడాదిన్నర క్రితం సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది.ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉంది.
కానీ ఇప్పటి వరకు షూటింగ్ కూడా పూర్తి అవ్వలేదు.

అసలు సినిమా పూర్తి అవుతుందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా మొదలు పెట్టాలి అనుకున్న సమయంలో కరోనా వచ్చింది.ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆలస్యం అవ్వడంతో త్రివిక్రమ్ ఏడాది పాటు ఆగాల్సి వచ్చింది.
మళ్లీ ఇప్పటికి సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది అనుకుంటూ ఉండగా అనూహ్యంగా మొదట మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి మృతి చెందారు.ఆ తర్వాత కృష్ణ మృతి చెందారు.
దాంతో రెండు మూడు నెలల పాటు సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది.ఈ సినిమా ప్రారంభించిన సమయంలోనే ఎందుకు ఇంతగా మహేష్ బాబుకు బ్యాడ్ సెంటిమెంట్ అంటూ కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.







