కొత్తగా చూస్తోందంటూ ‘‘ ది న్యూయార్క్ టైమ్స్ ’’ పత్రిక కథనాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్‌పై పెరుగుతున్న విశ్వాసం గురించి అమెరికా పత్రిక అందంగా రాసిందని రో ఖన్నా ప్రశంసించారు.
మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూల గురించి కూడా ప్రస్తావించారని ఆయన పేర్కొన్నారు.ఉక్రెయిన్‌పై రష్యా దాడి సమయంలో.
మాస్కో దండయాత్రను ఖండించాలని అమెరికా, ఐరోపాలు భారత్‌పై ఒత్తిడి చేశాయని ది న్యూయార్క్ టైమ్స్ గుర్తించింది.అయినప్పటికీ ఇండియా దానిని తిరస్కరించడమే కాకుండా.
రష్యాను తనకు అతిపెద్ద చమురు సరఫరాదారుగా మార్చుకుందని తెలిపింది.పాశ్చాత్య దేశాలు తనపై చేస్తున్న కుట్రలను ధీటుగా ఎదుర్కొందని తన కథనంలో ప్రస్తావించింది.
కాగా.భారత్‌ను నాటోప్లస్‌లో ఆరో దేశంగా చేసేందుకు రో ఖన్నా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
రక్షణ ఒప్పందాలకు సంబంధించి నాటో మిత్రదేశాలు త్వరగా ఆమోదం పొందుతాయని ఆయన చెబుతున్నారు.ఆస్ట్రేలియా, జపాన్, న్యూజిలాండ్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియాలు ప్రస్తుతం అదే ఒప్పందాన్ని కలిగి వున్నాయని రో ఖన్నా గుర్తుచేశారు.
ఇందుకోసం వైట్‌హౌస్‌లోని ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు రో ఖన్నా.కాస్త ఆలస్యంగానైనా రెండు ప్రజాస్వామ్య దేశాలు రక్షణ సహకారంలో గణనీయమైన పురోగతిని సాధించాయని ఆయన చెప్పారు.భారత్‌లోని ఇంజనీర్లు, శాస్త్రవేత్తల నుంచి ప్రతిభను అందుకోవడం పట్ల అమెరికాకు ఆసక్తి వుందని.తద్వారా తాము అత్యున్నత సాంకేతికతకు నాయకత్వం వహించడాన్ని కొనసాగించగలమని రో ఖన్నా అన్నారు.
యూఎస్ ఇండియా కూటమి అమెరికా ప్రయోజనాలకు మాత్రమే కాకుండా.

భారతదేశ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.భారత్ కు అమెరికా విశ్వసనీయ, బలమైన భాగస్వామి అని రో ఖన్నా పేర్కొన్నారు.ఇప్పటికే .భారత్- అమెరికా రక్షణ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి వీలుగా రో ఖన్నా ప్రతిపాదించిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్‌డీఏఏ)కు జూలై 14న యూఎస్ ప్రతినిధుల సభ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.పౌర అణు ఒప్పందం తర్వాత ఇండో యూఎస్ సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది అత్యంత కీలకమైనదని ఖన్నా వ్యాఖ్యానించారు.
భారతదేశంతో బలమైన భాగస్వామ్యం అవసరమని.రక్షణ భాగస్వామ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికాకు కీలకమని ఆయన గతేడాది అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.