చదువుల తల్లే కాదండోయ్.. చదువుల స్వామి కూడా ఉన్నాడు!

చదువు పేరు వినగానే మన మనసులో మదిలే దేవత సరస్వతి.తెల్ల చీరతో దర్శనమిస్తుంది.

 Chaduvula Swamy Hayagreeva Special Story, Chaduvula Swamy, Pooja , Saraswathi ,-TeluguStop.com

అంతే కాదు వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం.వీటన్నింటికీ అధి దేవతగా సరస్వతీ దేవిని పూజిస్తారు.

కానీ చదువుల తల్లే కాక చదువులు స్వామి కూడా ఉన్నాడు.ఆయనెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

విద్యను, వివేకాన్ని ఇచ్చే దేవుడు హయగ్రీవుడు అంటుంటారు మన పెద్దలు.మానవ శరీరానికి గుర్రపు తల ఉన్న హయగ్రీవుడిని హయ శీర్షిక అని కూడా అంటుంటారు.

ఏపీలోని హిందూపురం, మచిలీపట్నాల్లో హయగ్రీవ ఆలయాలు కూడా ఉన్నాయి.వైష్ణవ సంప్రదాయంలో హయగ్రీవుడికి ప్రముఖ స్థానముంది.

ఆయనకు మొత్తం నాలుగు చేతులు ఉంటాయి.అందులో పైరెండు చేతుల్లో శంఖు చక్రాలు ఉండగా.

కుడి చేతిలో అక్షర మాల, ఎడమ చేతిలో పుస్తకం ఉంటుంది.శ్రావణ పౌర్ణమిని హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు.

ఆ రోజు హయగ్రీవుడికి పూజ చేస్తే… చదువు బాగా అబ్బుతుందని ప్రజల నమ్మకం.అంతే కాదండోయ్ ఈ కింద స్తోత్రం పఠిస్తే మరింత మంచి జరుగుతుందట.

హయగ్రీవ స్తోత్రం.

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |

నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః|| 1 ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |

తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్|| 2 ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |

వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః|| 3 ||

ఫలశ్రుతి : శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |

వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం|| 4 ||

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube