అందుబాటులో బైక్( Bike ) ఉంటే యువత దానిపై విన్యాసాలు చేస్తుంటారు.రోడ్లపై రయ్యన దూసుకుపోతుంటారు.
ఒక్కోసారి బైక్‌పై తమ ఫ్రెండ్స్, లవర్స్‌ను ఎక్కించుకుని ప్రమాదకర స్టంట్స్( Dangerous Stunts ) చేస్తుంటారు.తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా వారు ప్రమాదంలోకి నెట్టేస్తారు.
ఒక్కోసారి అదుపు తప్పి ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూశాం.అయినా యువతలో మార్పు రావడం లేదు.
ఫీట్లు చేయాలనే సరదా నిండు ప్రాణాలను గాలిలో కలిపిస్తోందని అందరికీ తెలిసినా మార్పు రావడం లేదు.ప్రమాదకర విన్యాసాలతో ప్రాణాలు పోగొట్టకుని తమ కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచేస్తున్నారు.
ఇలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాజాగా ఐపీఎస్ అధికారి, టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్( TSRTC MD Sajjanar ) ఓ కీలక వీడియో అప్‌లోడ్ చేశారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.సోషల్ మీడియాలో సజ్జనార్ చాలా యాక్టివ్‌గా ఉంటారు.ప్రజలను అప్రమత్తం చేసే పలు వీడియోలను ఆయన పోస్ట్ చేస్తుంటారు.ప్రజల్లో మార్పు తీసుకొచ్చి, నిబంధనలు పాటించేలా ప్రేరేపించడమే లక్ష్యంగా ఆ వీడియోలు ఉంటాయి.
తాజా వీడియోలో ఓ యువకుడు తన ప్రియురాలిని ( Girlfriend ) బైక్‌పై ఎక్కించుకుని విన్యాసాలు చేశాడు.
రాత్రికి రాత్రే సోసల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే లక్ష్యంతో వారు అలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నట్లు అర్ధం అవుతోంది.బైక్‌ను వేగంగా పోనిస్తూ, అటూ ఇటూ వంచుతూ ముందుకు సాగాడు.అంతేకాకుండా ముందు చక్రం గాలిలో లేపాడు.
తర్వాత రన్నింగ్‌లో ఉండగానే ఆ వ్యక్తి వెనక్కి వెళ్లి, తన ప్రియురాలిని ముందుకు పంపించాడు.ఈ వీడియోను పోస్ట్ చేసి దానికి క్యాప్షన్‌గా ‘ఏం జరగనంత వరకు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ బానే ఉంటాయి.
తేడా వస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని ఈ తరహా పిచ్చి పనులు చేయకండి’ అని సజ్జనార్ హితోపదేశం చేశారు.