మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) భోళా శంకర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమయం ఆసన్నం అయ్యింది.మరో నెల రోజుల్లోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
దీంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.చిరంజీవి చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ‘భోళా శంకర్ ( Bhola Shankar )’ ఒకటి.
తమిళ్ వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు.

తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ ( Keerthy Suresh )చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.
అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.అలాగే ఈ సినిమాను ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
రిలీజ్ కు దగ్గర పడుతుండడంతో ఈ సినిమా నుండి వరుసగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ అంచనాలు మరింత పెంచేస్తున్నారు.
ఈ క్రమంలోనే టీజర్ రిలీజ్ అవ్వగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి మరో అప్డేట్ వచ్చింది.ఈ సినిమా షూట్ ఫినిష్ అయినట్టు మెహర్ రమేష్ సోషల్ మీడియా వ్యాప్తంగా అఫిషియల్ గా అప్డేట్ ఇచ్చాడు.
సినిమా కోసం కష్టపడినా సిబ్బందికి, నటీనటులకు కృతజ్ఞతలు అంటూ మెగాస్టార్ తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ పోస్ట్ చేసారు.

అలాగే ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని.త్వరలోనే మ్యూజికల్ అప్డేట్ ఉంటుంది అని మెహర్ రమేష్ చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.చూడాలి మరి మెగాస్టార్ భోళా శంకర్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారో లేదో.







