స్టార్ డైరెక్టర్ రాజమౌళి( Rajamouli ) ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు.రాజమౌళితో సినిమాలను నిర్మించడానికి క్యూ కడుతున్న నిర్మాతల సంఖ్య ఎక్కువగా ఉంది.
అయితే రాజమౌళి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎదుర్కొన్న అవమానాలు అన్నీఇన్నీ కావు.శాంతి నివాసం సీరియల్ తో రాజమౌళి కెరీర్ మొదలుకాగా స్టూడెంట్ నంబర్ 1 సినిమా( Student Number 1 Movie ) జక్కన్న జీవితాన్ని మార్చేసిందనే సంగతి తెలిసిందే.
స్టూడెంట్ నంబర్1 సినిమాకు రాజమౌళి డైరెక్టర్ కాగా రాఘవేంద్ర రావు ( Raghavendra Rao ) దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.అయితే ఈ సినిమా విజయం సాధించినా చాలామంది ఆ సక్సెస్ క్రెడిట్ ను రాజమౌళికి ఇవ్వకుండా రాఘవేంద్ర రావుకు ఇచ్చారు.
ఈ రీజన్ వల్లే స్టూడెంట్ నంబర్ 1 సినిమా సక్సెస్ సాధించిందని ఇండస్ట్రీలో చాలామంది నమ్మారు.ఈ రీజన్ వల్లే రాజమౌళికి ఆ సమయంలో ఎక్కువ ఆఫర్లు రాలేదు.

అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఒక కొత్త సినిమాను మొదలుపెట్టగా డైరెక్టర్ షూట్ చేసిన సన్నివేశాలు నచ్చక ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.తనకు తొలి సక్సెస్ ఇచ్చిన రాజమౌళికి మరో ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ సింహాద్రి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.ఈ సినిమా తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు.

సింహాద్రి సినిమా రీ రిలీజ్ లో సైతం అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకుంది.జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ టాలీవుడ్ లోని బెస్ట్ కాంబినేషన్లలో ఒకటి.జూనియర్ ఎన్టీఆర్ నటనకు తాను ఫిదా అవుతానని రాజమౌళి సైతం పలు సందర్భాల్లో వెల్లడించారు.
ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







