తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ సిద్ధాంతం లేని పార్టీ అని విమర్శించారు.
ఫించన్ రూ.4 వేలు ఇస్తామని ప్రకటిస్తే విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు.ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తామని చెబితే తప్పేముందని ప్రశ్నించారు.
రాష్ట్రంలోని బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని చెప్పారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తామని తెలిపారు.
ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ సభ రాబోయే ఎన్నికల్లో విజయానికి నాంది అని వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.







