స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో( Allu Arjun-Trivikram )లో ముచ్చటగా మూడు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.మూడు సినిమాలు ఒకదాని మించి మరొకటి రిలీజ్ అయ్యాయి.
జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు మూడు కూడా మంచి హిట్ అయ్యాయి.ఇక హ్యాట్రిక్స్ హిట్ తమ ఖాతాలో వేసుకున్న తర్వాత మరోసారి ఈ కాంబో కలిసి పని చేయబోతుంది.

మరి ఈ కాంబోపై అంచనాలు అప్పుడే పీక్స్ కు వెళ్లిపోయాయి.అందుకే ఈ ప్రాజెక్ట్ అఫిషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాను అతి త్వరలోనే అఫిషియల్ లాంచ్ చేయబోతున్నారు అనే టాక్ బయటకు వచ్చింది.ఈసారి ఈ ఇద్దరి కాంబోలో పాన్ ఇండియన్ మూవీ రాబోతుండగా మరో రెండు రోజుల్లో ఈ సినిమా అఫిషియల్ గా ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
కాగా ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తో కలిసి హారిక హాసిని క్రియేషన్స్( Harika Hasini Creations ) వారు నిర్మిస్తుండగా తమన్నా సంగీతం అందించనున్నాడు.ఈసారి ఈ క్రేజీ కాంబో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేయనున్నారని అంటున్నారు.
ఇందుకోసం త్రివిక్రమ్ ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసారని టాక్.

ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ తో చేస్తున్న గుంటూరు కారం( Guntur Karam ) చేస్తున్నాడు.ఇప్పటికే దాదాపు సగం వరకు షూట్ పూర్తి అవ్వగా ఈ సినిమా 2024 సంక్రాంతి బరిలో దిగబోతుంది.అలాగే అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2( Pushpa 2 ) చేస్తున్నాడు.
ఇది కూడా సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా క్లారిటీ లేదు.
ఈ రెండు పూర్తి అయితే కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది.







