ఏపీలో రాజకీయాలు( AP Politics ) ఒక్కసారిగా వేడెక్కాయి.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమాన్ని వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకు చేర్చారు.అవినీతికి ఆస్కారం లేకుండా.
వివక్షతకు తావు లేకుండా సీఎం జగన్( CM Jagan ) తరపున వాలంటీర్లు అనితరమైన సేవలను అందిస్తున్నారన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’( Memantha Siddham ) పేరిట బస్సు యాత్రను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
జగన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గ్రామ / వార్డు వాలంటీర్లు రాజీనామా చేయగా.తాజాగా మరి కొంతమంది రాజీనామాల బాట పట్టారు.
జగనన్న కోసం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో సుమారు ఎనిమిది వందల మంది వాలంటీర్లు( Volunteers ) రాజీనామా చేశారు.
జగనన్న కోసం తామంతా సిద్ధమని కీలక ప్రకటన చేశారు.వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన ఆయనకే తమ మద్ధతు ఉంటుందని తేల్చి చెప్పారు.అయితే తాజాగా ‘మేమంతా బస్సు’ యాత్ర పేరిట సీఎం జగన్ జనంలోకి వెళ్తున్నారు.
ప్రజా సమస్యలను వింటూ ముందుకెళ్తున్నారు.ఈ క్రమంలోనే విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం జగన్ పై దాడి( Attack on CM Jagan ) జరిగిన సంగతి తెలిసిందే.
అయినప్పటికీ ఆయన ప్రయాణం మాత్రం ఆగలేదు.వైద్యుల సూచన మేరకు ఒకరోజు తన యాత్రకు తాత్కాళిక విరామం ఇచ్చిన జగన్ బస్సు యాత్ర మళ్లీ కొనసాగుతోంది.
కాగా.నవరత్నాల( Navaratnalu ) ద్వారా ప్రతి పేదవాడికి మంచి జరగాలన్న జగనన్న ఆశయాన్ని వాలంటీర్లు సేవా భావంతో పని చేస్తూ నిర్వర్తిస్తున్నారు.అయితే వాలంటీర్లను ప్రతిపక్షాలు అవమానించినా, అపహేళన చేసినా వారు మాత్రం ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే విపక్షాల కుట్రలను ఏ మాత్రం పట్టించుకోని వాలంటీర్లు.
తమకు మంచి చేసిన జగనన్నకే మద్ధతు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఏపీలో గ్రామ/వార్డు వాలంటీర్లు రాజీనామాలు చేస్తుండటం విశేషం.