తీవ్రంగా గాయపరిచి స్వదేశీయుడి మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన వ్యక్తిని దోషిగా తేల్చింది సింగపూర్ కోర్ట్( Singapore Court ). నిందితుడిని 33 ఏళ్ల శక్తివేల్ శివసూరియన్‌గా గుర్తించారు.
ఇతను బెయిల్‌పై వున్నప్పుడు ప్రభుత్వోద్యోగికి తప్పుడు సమాచారం సైతం అందించినట్లుగా నమోదైన మరో అభియోగంపైనా నేరాన్ని అంగీకరించాడు.శక్తివేల్‌కు నవంబర్‌లో కోర్ట్ శిక్షలు ఖరారు చేయనుందని ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.
ఓ ట్యాక్సీలో నుంచి దిగుతుండగా శక్తివేల్, మంజునాథ లూయిస్ రవి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో కిందపడిన మంజునాథపై శక్తివేల్( Sakthivel Sivasurian ) పిడిగుద్ధులు కురిపించాడు.
అయితే ఇద్దరి మధ్యా వున్న సంబంధం ఏమిటన్నది మాత్రం కోర్టు పత్రాల్లో పేర్కొనబడలేదు.వారిద్దరి జాతీయతలను కూడా మీడియా నివేదికలో పేర్కొనలేదు.

16 రోజుల విచారణలో డిఫెన్స్ వాదన ఏమిటంటే.మంజునాథ కింద పడటం వల్ల శరీరానికి తగిలిన గాయం ప్రాణాంతకమైనది కాదు.కానీ ఎప్పుడైతే శక్తివేల్ అతనిపై విచక్షణారహితంగా దాడి చేశాడో.తొలుత ఏర్పడిన గాయం తీవ్రంగా పరిణమించి, అతని మరణానికి దారి తీసింది.కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.నేలపై పడిపోయిన మంజునాథను పైకి లేపేందుకు శక్తివేల్, మరో మహిళ కలిసి యత్నించారు.
ఈ క్రమంలో మంజునాథ( Manjunatha Louis Ravi ) రెండు సార్లు కిందపడిపోయినట్లు శక్తివేల్ తరపు న్యాయవాది వాస్వానీ సంజీవ్ .జిల్లా జడ్జి జేమ్స్ ఎలిషా లీ దృష్టికి తీసుకెళ్లారు.అంబులెన్స్ రాకముందే మంజునాథను శక్తివేల్ గడ్డివాముకు తరలించాడు.

ఘటన జరిగిన రోజు అంటే జూలై 18, 2020న రాత్రి 11 గంటల సమయంలో మంజునాథ, మరో మహిళ, శక్తివేల్ , అతిని భార్య టాక్సీలో వెళ్తున్నారు.కారు దిగిన వెంటనే శక్తివేల్, మంజునాథల మధ్య వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో మంజునాథ కిందపడిపోగా.
తిరిగి లేవలేకపోయాడు.ఆసుపత్రిలో వైద్యులు నిర్వహించిన స్కాన్‌లో అతని మెదడు ఉపరితలంపై రక్తస్రావం, వాపు కనిపించాయి.
అక్కడ చికిత్స తీసుకుంటూ జూలై 23, 2020న మంజునాథ తుదిశ్వాస విడిచాడు. పోస్ట్‌మార్టం రిపోర్టులో మంజునాథ ఎడమ కన్నుపైన వున్న ఎముకలో పగుళ్లు ఏర్పడినట్లు, అతని వెన్నెముక పక్కకు జరిగినట్లుగా తేలింది.







