Shaakuntalam : శాకుంతలం సినిమా నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. మాములుగా లేదుగా?

స్టార్ హీరోయిన్ సమంత ముఖ్య పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం.గుణశేఖర్ ( Gunasekhar )దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

 Mohan Babu First Look Released From Samantha Starrer Shaakuntalam Movie Tollywo-TeluguStop.com

ఇందులో దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.వీరితోపాటుగా పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ కూతురు అల్లు అర్హ( Allu Arha ) కూడా బాలనటిగా నటించింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది.దీంతో ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.

ఇప్పటికే ప్రమోషన్స్ ని షురూ చేశారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మోహన్‌బాబు( Mohan babu ) ఫస్ట్ లుక్‌ పోస్టర్ ని విడుదల చేశారు.ఇందులో మోహన్ బాబు దుర్వాస మహర్షి పాత్రలో నటిస్తున్నారు.తాజాగా ఆయన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.మహర్షిగా ఆయన లుక్‌ అదిరిపోవడంతో పాటు లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.రేపు అనగా మార్చి 19వ తేదీన మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా రెండు రోజుల ముందే మోహన్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

కాగా శకుంతల, దుష్యంత్‌ ప్రేమ కథ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, గుణా టీమ్‌ వర్క్ పతాకాలపై దిల్‌రాజు, నిలిమా గుణ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని సమంత అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.పాన్‌ ఇండియా సినిమాగా రూపొందిన ఈ సినిమాని విజువల్‌ వండర్‌గా తీర్చిదిద్దారు దర్శకుడు గుణశేఖర్‌.

ఇప్పటికే విడుదలైన టీజర్‌, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.విడుదలైన పాటలు వినసొంపుగా, అద్భుతంగా ఉన్నాయి.

ఈ సినిమా వచ్చే నెల ఏప్రిల్‌ 14న విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube