తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఏక ఛత్రాథిపత్యం...విజయం వైపా లేక పతనం వైపా....????

తన పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసే రేవంత్ రెడ్డి( Revanth reddy ) తానే సీఎంనంటూ ప్రకటించుకుంటున్నారా…అవుననే అంటున్నాయి తెలంగాణ రాజకీయ పరిణామాలు….తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటికే వరుసగా రెండు సార్లు గెలిచి మూడో సారి అధికార పీఠం దక్కించుకోవాలని అధికార BRS పార్టీ వ్యూహ రచనలు చేస్తుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో పూర్తిగా పట్టు సాధించిన బీజేపీ ఈ సారి తెలంగాణ లో పాగా వేయాలని చూస్తుంది… ఈ దిశగా ఇప్పటికే దూకుడు చూపిస్తుంది కూడా…ఐతే ఈ రెండు పార్టీల మధ్యలో గత 10 సంవత్సరాల నుండి కుదేలైన కాంగ్రెస్ పార్టీ కి( Congress party ) పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ,అధికార పగ్గాలు చేపట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ నేత రేవంత్ రెడ్డి…

 Tpcc Chief Revanth Reddy Full Confident Of Getting Congress Party Into Power Det-TeluguStop.com

ఆయన చేపట్టిన పాదయాత్ర కు( Padayatra ) పార్టీ నాయకులు,కార్యకర్తల నుండి మాత్రమే కాకుండా ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తుంది…కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీ కి ఈ తరుణం లో మంచి వార్తే ఇది…అయిట్ అదే సమయం లో రేవంత్ రెడ్డి యాత్రకు పోటీగా పార్టీ లోని ఇతర ముఖ్య నేతలైన మహేశ్వర్ రెడ్డి ,భట్టి విక్రమార్క వంటి వారు సైతం సొంత యాత్రలు చేపట్టినప్పటికీ పార్టీ కార్యకర్తల్లో కానీ ప్రజల లో కానీ ఆశించినంత స్పందన రాకపోవడంతో నిరాశతో వాటిని మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది ….

Telugu Congress, Maheshwar Reddy, Revanth Reddy, Revanthreddy-Telugu Political N

వీటన్నిటి బట్టి చూస్తే ప్రస్తుతానికి ప్రజల్ని ఆకర్షించి పార్టీ సామర్థ్యాన్ని పెంచగలిగే శక్తి ఇప్పుడు రేవంత్ రెడ్డికి మాత్రమే ఉన్నట్టు పరిణామాలు చోటుచేసుకున్నాయి…ఇదే సమయం గా రేవంత్ రెడ్డి కూడా కాబోయే సీఎం తనేనంటూ పలుమార్లు పరోక్షం గా చెప్పుకొచ్చారు… దీనితో మిగతా సీనియర్ నాయకులు ఆవేశం తో రగిలిపోతున్నారు…రేవంత్ కావాలనే తనని తాను కాబోయే ముఖ్యమంత్రి గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని మండి పడుతున్నారు….పార్టీ లోకి వచ్చిన కొత్తలో సీనియర్ నాయకులు అందరితో మర్యాదగా నడుచుకున్న రేవంత్ మారుతున్న పరిణామాల నేపథ్యంలో తన మాట తీరులో కూడా ఆ మార్పు చూపిస్తున్నారు…

Telugu Congress, Maheshwar Reddy, Revanth Reddy, Revanthreddy-Telugu Political N

అక్కడితో ఆగకుండా పార్టీ లో చాలా మంది సీనియర్లు కేసిఆర్ కోవర్టులని,వారు బయటకు పోతేనే పార్టీ బాగుపడుతుందని వారిపై విమర్శలు చేస్తున్నారు….ఇటు చూస్తే పార్టీ లోని సీనియర్ నాయకులు చాలా వరకు రేవంత్ తీరుపై అసంతృప్తి గాను రేవంత్ మాటలపై ఆక్రోశం గానూ ఉన్నారు…ప్రజా క్షేత్రంలోకి సమిష్టిగా వెళ్లి పార్టీ ని ఎన్నికలలో విజయం దిశగా పయనింప చేయాల్సిన పార్టీ నేతలు ఇలా తలో దిక్కు అవ్వడం ఇప్పుడిప్పుడే పాత ఆదరణను తిరిగి చూరగొంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube