పరీక్షల విషయమై దేశ వ్యాప్తంగా వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులు వివిధ రకాల కాళాశాలలో తీవ్రమైన వత్తిళ్లకు గురై ప్రాణాలను తీసుకుంటున్న సంగతి తెలిసినదే.ఏటా ఈ మరణాలు ఎక్కువై పోతుండడంతో ముఖ్యంగా పరీక్షల కారణంగా ఎదురయ్యే ఒత్తిడిని జయించేందుకు ప్రధాని మోదీ విద్యార్థులకు గైడెన్స్ ఇస్తూ ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ఒకదానిని నిర్వహిస్తున్నారు.ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ ప్రోగ్రామ్.2023లో కూడా త్వరలో జరగనుంది.
పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు BJP సన్నాహాలు చేస్తోంది.ఈ క్రమంలో భాగంగా సరిగ్గా ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షలకు ముందు ‘పరీక్షా పే చర్చ’ పేరుతో విద్యార్థులతో ప్రధాని మోడీ ఇంటరాక్ట్ కావడం విశేషం.
అదే విధంగా ఈ సారి కూడా ఈ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యం పెంచే విధంగా BJP ప్లాన్ చేస్తోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల్లోకి మరింత ఎక్కువగా తీసుకెళ్లేందుకు వందలాది పాఠశాలల్లో వివిధ రకాల పోటీలు నిర్వహించింది.

ప్రధాని మోడీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాలను కూడా పంపిణీ చేసింది.13 భారతీయ భాషలలో ఈ పుస్తకం అందుబాటులో ఉంది.వివిధ రాష్ట్రాల గవర్నర్లు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.కాగా ఈ నెల 27న ప్రధాని పరీక్ష పే చర్చ కార్యక్రమం జరగనుంది.తెలంగాణ వ్యాప్తంగా చాలా స్కూల్స్‌లో విద్యార్థులు వీక్షించే విధంగా BJP శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.ఇందులో భాగంగా ఈ రోజు పలు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాలు,

బహుమతి ప్రదానోత్సవాల్లో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, BJP నేతలు పాల్గొన్నారు.ఈ ‘పరీక్షా పే చర్చ 2023’ కార్యక్రమంలో కేవలం కొందరు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ పాల్గొనడానికి మాత్రమే అవకాశం ఉంటుంది.ఇక్కడ దేశం నలుమూలల నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి కొన్ని పోటీలను పెట్టి, విజేతలైన వారికి మాత్రమే కార్యక్రమానికి ఆహ్వానం ఉంటుందని గుర్తు పెట్టుకోండి.







