రాజానగరం వారాహి విజయభేరి సభలో పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో( Rajanagaram ) వారాహి విజయభేరి నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి( Purandeshwari ) పాల్గొన్నారు.

 Purandeshwari Sensational Comments In Rajanagaram Varahi Vijaya Yatra Details, A-TeluguStop.com

ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలని జగన్( Jagan ) అంటున్నారు.

కానీ ఫ్యాన్ స్పీడ్ 1, 2, 3 లేదా నాలుగు లోనే ఉండాలి.మనం దాన్ని 151లో పెట్టాం.

దీంతో మన ఇంటి పైకప్పు లేచిపోయింది.గోడలు కూలిపోయాయి.

ఇకనైనా ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలి. అని పిలుపునిచ్చారు.

జగన్ కు అధికారం ఇస్తే.తల లేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని విమర్శించారు.ఏపీలో జరగబోయే ఎన్నికలలో రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు వారాలు మాత్రమే సమయం ఉంది.దీంతో ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఈసారి ఎన్నికలలో బీజేపీ…టీడీపీ…జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.2014లో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేయగా విజయం సాధించటం జరిగింది.దీంతో ఈసారి కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూటమి పార్టీల నేతలు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube