రాజానగరం వారాహి విజయభేరి సభలో పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు..!!

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో( Rajanagaram ) వారాహి విజయభేరి నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి( Purandeshwari ) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలని జగన్( Jagan ) అంటున్నారు.

కానీ ఫ్యాన్ స్పీడ్ 1, 2, 3 లేదా నాలుగు లోనే ఉండాలి.

మనం దాన్ని 151లో పెట్టాం.దీంతో మన ఇంటి పైకప్పు లేచిపోయింది.

గోడలు కూలిపోయాయి.ఇకనైనా ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలి.

అని పిలుపునిచ్చారు. """/" / జగన్ కు అధికారం ఇస్తే.

తల లేని మొండెంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని విమర్శించారు.

ఏపీలో జరగబోయే ఎన్నికలలో రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడు వారాలు మాత్రమే సమయం ఉంది.

దీంతో ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఈసారి ఎన్నికలలో బీజేపీ.

టీడీపీ.జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.

2014లో ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేయగా విజయం సాధించటం జరిగింది.

దీంతో ఈసారి కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తామని కూటమి పార్టీల నేతలు భావిస్తున్నారు.

కెనడాలో మ్యాగీ నూడుల్స్‌తో షాకింగ్ ప్రయోగం.. -17°C చలికి ఏం జరిగిందో చూడండి..