హన్సిక కూడా పెళ్లికి రెడీ.. వరుడు ఎవరంటే..!

హీరోయిన్స్ పెళ్లి విషయంలో మీడియా స్పెషల్ ఇంట్రెస్ట్ అందరికి తెలిసిందే.కొద్దిగా కెరియర్ లో వెనకపడ్డ హీరోయిన్స్ అందరిని మీ పెళ్లెప్పుడు అని అడిగేస్తుంటారు.

 Heroine Hansika Ready To Marriage Business Man , Hansika, Marriage, Business Man-TeluguStop.com

అయితే కెరియర్ ఓ రేన్ జ్ ఫాంలో ఉన్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించే అవకాశం ఉండదు కానీ ఎప్పుడైతే కెరియర్ మందగిస్తుందో అప్పుడే పెళ్లి వైపు గాలి మళ్లుతుంది.లేటెస్ట్ గా సౌత్ హీరోయిన్ హాన్సిక కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అంతకుముందు శింబుతో లవ్ ట్రాక్ నడిపించిన హాన్సిక అతని నుంచి దూరమైంది.అర కొర అవకాశాలే వస్తున్నా వాటితోనే కెరియర్ వెళ్లదీస్తున్న అమ్మడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిందట.

పెళ్లికి రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇంట్లో వాళ్లు వరుడి వేటలో పడ్డారట.హాన్సిక కి ఓ బిజినెస్ మెన్ తో పెళ్లని ప్రచారం జరుగుతుంది.

ఆల్రెడీ మాట్లాడుకోవడం అంతా జరిగిందట.త్వరలోనే ఎంగేజ్ మెంట్ ఉండబోతుందని అంటున్నారు.

అందాల భామ హాన్సిక పెళ్లి అంటే ఆమె ఫ్యాన్స్ కొద్దిగా హర్ట్ అవుతున్నారు.అయితే ఒకప్పుడు అంటే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో సత్తా చాటుతున్నారు హీరోయిన్స్ అందుకు చాలా మంది ఎక్సాంపుల్ గా కూడా ఉన్నారు.

కాబట్టి పెళ్లి తర్వాత హాన్సిక కూడా నటిస్తుందా నటనకు ఫుల్ స్టాప్ పెడుతుందా అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube