ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.మొత్తం 428 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసింది.
అయితే ఈడీ ఛార్జ్‌షీట్‌లో ఎవరి పేర్లు చేర్చిందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.ఛార్జ్‌షీట్‌లో శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ తో పాటు అమిత్ అరోరా పేర్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా ప్రస్తుతం ఆరుగురు నిందితులు తీహార్ జైలులో ఉన్నారని సమాచారం.
గతంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లను ఈడీ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే.కాగా రూ.100 కోట్ల ముడుపులపై దర్యాప్తు చేస్తున్న ఈడీ విజయ్ నాయర్ ద్వారా ఆప్, ఎక్సైజ్ అధికారులకు ముడుపులు అందాయని ఆరోపిస్తుంది.ఇప్పటికే సమీర్ మహేంద్రు నాలుగు కంపెనీలపై గత నవంబర్ లో తొలి ఛార్జ్‌షీట్ ను ఈడీ దాఖలు చేసింది.అదేవిధంగా మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తుంది.