రాష్ట్రాభివృద్ధి కేంద్రం సహకరించడంలేదంటూ టీడీపీ, లక్షలాది కోట్లను సాయంగా ఇస్తున్నా చంద్రబాబు ఖర్చు చేయటం లేదంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే పరస్పరం సహకరించుకుంటూ, ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు.కేంద్ర నిధులపై ఇరు పార్టీలు తీరు కారణంగా రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరలా తయారయ్యిందని మండిపడ్డారు.
వీరి వ్యవహారాలను ప్రజా కోర్టులో బట్టబయలు చేసి ద్రోహులుగా నిరూపిస్తామన్నారు.
గురువారం కృష్ణా జిల్లా మైలవరంలో నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, విభజన కారణంగా ఆంధ్ర రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ముందుగానే అంచా వేసి,న కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రయోజనాలు కలిగేలా ఎన్నో అవకాశాలను కల్పించిందని తెలిపారు.అలాగే ప్రత్యేక హోదా విషయమై రాజ్య సభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చినా అమలులో విఫలమైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు ఒకటి కొకటి విమర్శించు కుంటూనే, పరస్పరం సహకరించు కుంటున్నాయని ఎద్దేవా చేసారు.
ప్రస్తుతం కేంద్రం రూ.6 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలుగుదేశం, రూ.1.70 లక్షల కోట్లు ఇచ్చామని బీజేపీ చెబుతున్నా… అడుగడుగునా అవినీతితో అణు మాత్రం అభివృద్ధి జరగనేలేదని , తెలుగు జాతికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదన్నారు రఘువీరా…
.






