పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమా అప్పుడే మొదలవుతుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ జోడి గురించి కొత్తగా చెప్పేదేముంది.రెండు సినిమాలు చేస్తే రెంటికి రెండూ మంచి విజయాన్ని సాధించాయి.

 Pawan Kalyan – Trivikram Film To Begin In November-TeluguStop.com

ఒకప్పుడు కరువులో వర్షంలా పవన్ కెరీర్ కి జల్సాని ఇచ్చిన త్రివిక్రమ్, అత్తారింటికి దారేది రూపంలో పవన్ కళ్యాణ్ కి తొలి ఇండస్ట్రీ హిట్ ని అందించాడు.ఇప్పుడు ఈ మ్యాజికల్ జోడి మరోసారి మనల్ని అలరించనుంది.

అ ఆ ను పూర్తి చేసిన త్రివిక్రమ్, ప్రస్తుతం పవన్ కోసమే ఓ కథను సిద్ధం చేస్తున్నారు.ఇదీ చాలా కొత్తగా ఉండే పాయింట్ మీద రాస్తున్న స్క్రిప్టు అని సమాచారం.

ఈ చిత్తాన్ని ఇదే ఏడాది నవంబర్ లో మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.మైత్రి మూవి మేకర్స్ ఈ సినిమాని నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాక్.

ఇక ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమా ఇదే నెలలో మొదలవుతుంది.ఈ సినిమా ఆలస్యమైతే, త్రివిక్రమ్ సినిమా కూడా ఆలస్యం అవుతుంది.

అందుకే, ఎస్ జే సూర్య చిత్రం త్వరగా పూర్తయిపోయి, త్రివిక్రమ్ రాసే డైలాగులు పవన్ మళ్ళీ చెప్తే వినాలని ఉవ్విళ్ళూరుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube