దర్శకుడు అవతారం ఎత్తిన మరో జబర్దస్త్ కమెడియన్

ఈ మధ్యకాలంలో టెలివిజన్ పై జబర్దస్త్ కామెడీ రియాలిటీ షో ద్వారా చాలా మంది టాలెంటెడ్ కమెడియన్స్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.నటులుగా, దర్శకులుగా తమ ప్రతిభని నిరూపించుకుంటున్నారు.

 Jabardasth Comedian Bullet Bhaskar Turns As Director, Tollywood, Telugu Cinema,-TeluguStop.com

ఇప్పటికే షకలక శంకర్ స్టార్ కమెడియన్ అయిపోయాడు.అయితే ఈ మధ్య కామెడీ పక్కన పెట్టి హీరోగా ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

మరోవైపు సుడిగాలి సుధీర్ హీరోగా మారిపోయాడు.రచ్చ రవి సినిమాలలో మంచి అవకాశాలు తెచ్చుకుంటున్నాడు.

చమ్మక్ చంద్ర కూడా సినిమా షూటింగ్ లో బిజీ అయిపోతున్నాడు.అలాగే జబర్దస్త్ స్టేజ్ నుంచి జీ తెలుగు అదిరింది షోలోకి వెళ్లి అక్కడ కొంత మంది కమెడియన్స్ సక్సెస్ అయ్యారు.

అలాంటి వారిలో సద్దాం కూడా ఒకడు.మరో వైపు అదిరింది షోకి వెళ్లిన తర్వాత కిరాక్ ఆర్పీ ఏకంగా దర్శకుడుగా మారిపోయాడు.

జేడీ చక్రవర్తి హీరోగా ఒక సినిమా ప్లాన్ చేశాడు.ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ దర్శకుడుగా మారిపోయాడు.జబర్దస్త్ ఇక్కువగా సినిమాటిక్ స్కిట్స్ తో అలరించిన బుల్లెట్ భాస్కర్ దర్శకుడుగా మారి అదిరిందిషోతో ఫేమస్ అయినా సద్దాంని హీరోగా పెట్టి సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకి నాగబాబు సమర్పకుడుగా ఉండటం విశేషం.ఈ విషయాన్ని నాగబాబు స్వయంగా తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.బస్తీ బాయ్స్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబందించిన పోస్టర్ ని కూడా నాగబాబు షేర్ చేశారు.ఈ చిత్రంలో సద్దాంతో పాటు ఇంకా ఎవరెవరు బాయ్స్ నటిస్తున్నారో గెస్ చేయాలని నాగబాబు కామెంట్స్ చేశారు.

సరిగ్గా అంచనా వేసిన వారికి ఆ టీమ్‌తో లైవ్‌లో మాట్లాడే అవకాశం కల్పిస్తామని చెప్పారు.ఆ బస్తీ బాయ్స్‌తో హైదరాబాద్ దావత్ ఉంటుందని చెప్పారు.

మరి సద్దాంతో పాటు ఈ సినిమాలో బస్తీ బాయ్స్ గా నటించిన వారు ఎవరనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube