హోమ్ మినిష్టర్ తానేటి వనిత.అంకిరెడ్డి గూడెం అగ్నిప్రమాదం ఘటనలో స్పాట్ లో ఐదుగురు చనిపోయారు.
మృతులకు ఇప్పటికే నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది.మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి 25 లక్షలు, ఫ్యాక్టరీ నుండి 25 లక్షలు మొత్తం 50 లక్షల పరిహారం అందిస్తున్నాం.
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా ఉంది.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరాము.
ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నాం.కంపెనీ స్థాపించి దాదాపుగా 18 ఏళ్ళు అవుతోంది.
యజమాన్యానిది తప్పని తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.
ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు.50లక్షల పరిహారం ఇస్తున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దారుణం.ప్రమాదకర కంపెనీలపై గత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు.
గత ప్రభుత్వంలో ఎప్పుడు ప్రమాదాలు జరగలేదా.అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం.







