కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చాలా ఏళ్ల క్రితం వచ్చిన మూవీ ‘చంద్రముఖి’.అప్పట్లో చంద్రముఖి సినిమా తమిళం మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో భారీ వసూళ్లు నమోదు అవ్వడం జరిగింది.
రికార్డ్ బ్రేకింగ్ వసూళ్ల ను అప్పట్లో రాబట్టిన చంద్రముఖి సినిమా కు ఇప్పుడు సీక్వెల్ రూపొందింది.అదే దర్శకుడు లారెన్స్( Raghava Lawrence ) ప్రధాన పాత్ర లో కంగనా రనౌత్ హీరోయిన్ గా రూపొందించడం జరిగింది.
సీక్వెల్ అంటే రజినీకాంత్ ఉండాలి, చంద్రముఖి పాత్రను జ్యోతిక చేస్తేనే అది అసలైన సీక్వెల్ అవుతుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.అంతే తప్ప హీరోయిన్ ని మార్చి, అసలు హీరోనే లేకుండా చేసి ఇప్పుడు సీక్వెల్ అంటే ఎలా అంటూ నెటిజన్స్ తిట్టి పోస్తున్నారు.
అయినా కూడా పట్టుదలతో చంద్రముఖి 2 ( Chandramukhi 2 )సినిమా ను దర్శకుడు వాసు( Vasu ) పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశాడు.ఈ నెలలోనే సినిమా ను విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది.అంతా బాగానే ఉంది, విడుదల అవ్వబోతుంది అనుకుంటూ ఉండగా అనూహ్యంగా విడుదల వాయిదా వేస్తూ అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.చిత్ర యూనిట్ సభ్యుల్లో కొందరు గ్రాఫిక్స్ విషయం లో పెదవి విరుస్తున్నారట.
మరి కొందరు మాత్రం సినిమా మేకింగ్ లో లోపాలు ఉన్నాయి.నాలుగు అయిదు సీన్స్ సినిమా స్థాయిని దిగజార్చే విధంగా ఉన్నాయి.కనుక విడుదల చేయకుండా వాటిని మార్చితే ఉత్తమం అన్నట్లుగా మాట్లాడుకున్నారట.అందుకే సినిమా విడుదల తేదీ మార్చుతున్నట్లుగా ప్రకటించారు.ఎప్పుడు విడుదల చేసేది క్లారిటీ ఇవ్వడం లేదు.మొత్తానికి చంద్రముఖి 2 విషయం లో ఫ్యాన్స్ అసంతృప్తి గా ఉన్నారు.
అయినా కూడా దర్శకుడు మరియు హీరో లు సినిమా ను కాస్త మార్చి కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.