విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు.ఇక ఆయన చేసిన సినిమాల వల్ల ఇండస్ట్రీలో ఆయనకి మంచి గుర్తింపు అయితే వచ్చింది.
అయితే ఆయన చేసిన పెళ్లి చూపులు( Pellichoopulu Movie ) సినిమాతోనే నటుడిగా వైవిధ్యాన్ని చూపించాడు.ఇక ఇది ఇలా ఉంటే ఆ సినిమా తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
అయితే విజయ్ పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాయి.

అయితే ఈ సినిమా సమయంలో విజయ్ దగ్గర ఎక్కువగా ఆటిట్యూడ్ కనిపించేది.లైగర్ సినిమా( Liger ) సమయంలో అయితే మరి బీభత్సమైన ఆటిట్యూడ్ ను చూపించాడు.ఇక ఈ సినిమా డిజాస్టర్ అవడంతో తన ఆటిట్యూడ్ మొత్తాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఎక్కడైనా కూడా చాలా రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాడు.అంతకుముందు తనకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉండేవాడు.
ఎప్పుడైతే లైగర్ ప్లాప్ అయిందో అప్పటి నుంచి ఆయన ఆటిట్యూడ్ మొత్తాన్ని మార్చేసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి( Gowtam Tinnanuri ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
అలాగే పరుశురాం డైరెక్షన్ లో ‘ఫ్యామిలీ స్టార్’( Family Star Movie ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది.

ఇక రెండు సినిమాలతో రాణించి మళ్లీ పూర్వ వైభవం పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక గత సంవత్సరం శివ నిర్వాణ డైరెక్షన్ లో వచ్చిన ఖుషి సినిమా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ నటుడిగా మాత్రం ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిందనే చెప్పాలి…ఇక మొత్తానికైతే విజయ్ ప్రస్తుతం తన ఆటిట్యూడ్ ను విడిచిపెట్టి మరి సినిమాలు చేయడం అనేది మంచి విషయం అనే చెప్పాలి…
.