తెలంగాణలో మూడోసారి గులాబీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) పావులు కలుపుతున్నారు.విపక్ష పార్టీలకు ఎక్కడా అవకాశం దొరకకుండా చేయాలని , మూడోసారి హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.
అందుకే ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సర్వేలు చేయిస్తూ ,ప్రజల నాడిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఏ విషయాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
ఏ విషయాల్లో ప్రభుత్వంపై సానుకూలత ఉంది అనే అంశాల పైన సర్వే చేయిస్తున్నారు.అలాగే నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి , సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, విపక్ష పార్టీల బలాబలాలు ఏమిటి ? ఎలా అనేక అంశాలపై సర్వే( Survey ) చేయిస్తూ దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా వారు మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం దక్కుతుందని కెసిఆర్ నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు దాదాపు 75 నుంచి 105 మంది అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఈ జాబితాను ఆగస్టు 18 వ తేదీన ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారట.మంత్రి అయినా, అనుభవం ఉన్నా, ఎమ్మెల్యే అయినా, నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న బలాబలాలు, సామర్థ్యాలు, గెలుపోవటములు వంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకునే అభ్యర్థులను ఎంపిక( BRS Candidates ) చేస్తామని ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇక ఇటీవల కాలంలో విపక్ష కాంగ్రెస్ , టిడిపి, బిజెపి వంటి పార్టీలకు చెందిన కీలక నేతలు ఎంతోమంది బీఆర్ఎస్ లో చేరారు.వీరిలో పలువురికి మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు , ఇతర నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా, పదవుల కోసం ఎదురుచూస్తున్న వారి జాబితా ఎక్కువగా ఉంది.

అలాగే గత ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) నుంచి పోటీ చేసి ఓటమి చెంది, ఈ ఐదేళ్లలో ఎటువంటి పదవులు లేక ఖాళీగా ఉన్న నేతలు వచ్చే ఎన్నికలు తమకు టెక్కెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు.అయితే పనితీరు , సర్వే నివేదికలు ఆధారంగానే అభ్యర్థులు ఎంపికను కేసీఆర్ చేపట్టారు.ఈ విషయంలో ఎటువంటి మొహమాటాలకు వెళ్ళకపోవడంతో, ఎవరికి సీటు దక్కుతుంది ఎవరికి నిరాశ తప్పదు అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.ప్రస్తుతం కేసీఆర్ విడుదల చేయబోయే జాబితాపై ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, విపక్ష పార్టీలు ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత తాము అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ బిజెపిలు నిర్ణయించుకున్నాయి.







