బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో వీరికి మాత్రమే అన్యాయం జరుగుతుందా ?

బిగ్ బాస్ షో.తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో.

 Bigg Boss Telugu Eliminated Candidates Not Happy Details,  Bigg Boss Telugu, Big-TeluguStop.com

వుడ్ లో బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ షోని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చి మరి జూనియర్ ఎన్టీఆర్ ని హోస్టుగా పెట్టి రంగంలోకి దింపారు.హోస్తులు మారుతున్నారు, సీజన్స్ మారుతున్నాయి, ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 నడుస్తోంది.

మూడు నెలల పాటు ఈ షోలో కొంతమంది సెలబ్రిటీలను రెమినేషన్ ఇచ్చి మరి తీసుకొచ్చి వాళ్ళ మంచి చెడు అన్ని టీవీలో చూసేలా చేసి వారి వ్యక్తిత్వంపై టిఆర్పి రేటింగ్ పెంచుకుంటూ ముందుకు సాగే ఈ షో ఇప్పటివరకు ఐదు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా ముగించింది.అయితే సీజన్ వచ్చిందంటే చాలు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ హడావిడి మామూలుగా ఉండదు.

ఇంటర్వ్యూ లిస్టు షోలో విషయాలు బయటకు చెబుతూ రచ్చ రంబోలా చేస్తూ ఉంటారు.ఇక మొదటి 1 లేదా 2 వారాలకు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ పరిస్థితి మరోలా ఉంటుంది.

ఈ విషయంలో అన్ని సీజన్స్ కి ఒకే ఒక సెంటిమెంట్ మాత్రం బలంగా వినిపిస్తోంది.అసలు విషయం ఏంటంటే, నాకు చాలా అన్యాయం చేశారు షో వాళ్ళు అని, అసలు ఈ బిగ్ బాస్ షో ఒక స్క్రిప్టెడ్ షో అని లేదంటే అక్కడ నాకు మాత్రమే అన్యాయం జరిగిందని నేను బాగా ఆడినా కూడా నాకు సంబంధించిన క్లిప్పులు టెలికాస్ట్ చేయలేదని, బయటకు పంపడానికి మోసం చేస్తున్నారంటూ నిర్వాహకులకపై కామెంట్స్ చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు.

మొదటి వారాల్లో ఎలిమినేట్ అయి బయటకు వస్తున్న ఇంటి సభ్యులు.

Telugu Abhinaya Sri, Bb, Bigg Boss, Nagarjuna, Shaani-Movie

అంతేకాదు ముందే విన్నర్ ని కూడా నిర్ణయించుకుని వారికి సంబంధించిన ఆటను మాత్రమే జనాలకు పాజిటివ్ గా చూపించి వారికి ఓట్లు వచ్చేలా చేస్తున్నారనేది మరి కొంత మంది వాదన.లేదంటే అసలు ఓటింగ్ ఫేక్ అని కొంతమంది ఇంటి సభ్యులు సోషల్ మీడియా సాక్షిగా మిగతా సభ్యుల అభిమానులతో గొడవకు దిగుతున్నారు.మొదటి సీజన్ మినహాయిస్తే మిగతా అన్ని సీజన్స్ యొక్క మొదటి రెండు మూడు వారాల ఎలిమినేటెడ్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా దాదాపు ఇలాగే ఉన్నాయి.

ఆడి గెలవలేక ఊడిపోయి నిర్వాహకులపై అవాకులు, చెవాకులు మాట్లాడటం సభ్యులకు పరిపాటిగా మారిపోయింది.ఇక బిగ్ బాస్ సీజన్ 6 కూడా ఇందుకు మినహాయింపు ఏమాత్రం కాదు.

ఇప్పటికే బయటకొచ్చిన అభినయ శ్రీ , షాని ఇద్దరు కూడా బిగ్ బాస్ వల్ల మాకు అన్యాయం జరిగిందంటూ ఇంటర్వ్యూస్ ఇవ్వడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube