విజయసంకల్ప యాత్ర పేరుతో తెలంగాణలో బీజేపీ బస్సు యాత్రలు..!

తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలకు బీజేపీ రంగం సిద్ధం చేసింది.ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,025 కిలోమీటర్ల మేర సంకల్ప యాత్రను కమలనాథులు నిర్వహించనున్నారు.

 Bjp Bus Trips In Telangana In The Name Of Vijayasankalpa Yatra..!-TeluguStop.com

విజయసంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టనుంది.ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఐదు బస్సు యాత్రలు చేయనున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.ఈ క్రమంలో బస్సు యాత్ర పోస్టర్ ను ఆయన విడుదల చేశారు.17 పార్లమెంట్ స్థానాలను ఐదు క్లస్టర్లుగా విభజించామన్నారు.కొమురంభీం క్లస్టర్ గా ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్., శాతవాహన క్లస్టర్ గా కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల., కాకతీయ క్లస్టర్ గా వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్., భాగ్యనగర్ క్లస్టర్ గా భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్.

, కృష్ణమ్మ క్లస్టర్ గా మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ ఉండనున్నాయని పేర్కొన్నారు.కాగా ఈ అన్ని యాత్రలు చివరగా హైదరాబాద్ లోకలిసేలా డిజైన్ చేశామని ఆయన వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube