టాలీవుడ్ హీరోల్లో మొదటి పాన్ ఇండియా మార్కెట్ తెరచింది ప్రభాస్ అన్నమాట వాస్తవమే.ప్రభాస్ తెలుగు హీరో అన్నది మర్చిపోయి ఆయన నేషనల్ స్టార్ అనేలా బాహుబలితో చేసుకున్నాడు.
ఇక ఆ తర్వత నుంచి ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ కి తగ్గనివ్వట్లేదు.అఫ్కోర్స్ ప్రభాస్ మార్కెట్ కూడా అందుకు తగినట్టుగానే పెరిగింది.
ఇక అదే దారిలో మరికొంతమంది స్టార్స్ పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు.ఆర్.
ఆర్.ఆర్ తో ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు కూడా ఆ ఫీట్ సాధించారు.
ఇక అంతకుముందే వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ లెవల్ లో ఆడియన్స్ ని అలరించాడు అల్లు అర్జున్.పుష్ప 2 తో మరోసారి తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు.
అయితే లేటెస్ట్ గా అల్లు అర్జున్ సందీప్ వంగతో ఒక సినిమా ఎనౌన్స్ చేశాడు.ఆ సినిమాను టీసీరీస్, భద్రకాళి మూవీస్ కలిసి నిర్మిస్తుంది.ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 120 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.ప్రభాస్ 100 కోట్ల దగ్గరే ఉండగా అల్లు అర్జున్ అతన్ని దాటేశాడు.
అయితే అల్లు అర్జున్ కి ఆ స్టామినా ఉంది కాబట్టే టీసీరీస్ అలా ఆఫర్ చేసిందని అంటున్నారు.ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెమ్యునరేషన్ గురించి గొడవపడుతున్నారు.
మొత్తానికి అల్లు అర్జున్ ఈ సినిమాకు 120 కోట్లు తీసుకుంటే ప్రభాస్ నెక్స్ట్ సినిమాకు 150 చేసినా చేయొచ్చు.ఎవరైనా సరే మన సౌత్ హీరోలే కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందే.