6 ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన సేఫెస్ట్ కార్స్ ఇవే... ధర కూడా కాస్త తక్కువే మరి!

సాధారణంగా చాలా కార్లలో కేవలం డ్రైవర్ దగ్గర మాత్రం ఎయిర్ బాగ్స్ సదుపాయం అనేది ఉంటుంది.మిగతా చోట్ల ఉండదు.

 These Cars In India Comes With Six Air Bags Details, 6 Air Bags, Car, Technology-TeluguStop.com

అలాంటప్పుడు ప్రమాదాలు జరిగినపుడు డ్రైవర్ కి ఏమి కాదు గానీ మిగిలిన వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.ఈ కారణంగానే ఏటా అనేక మరణాలు సంభవిస్తున్నాయని ఓ సర్వే.

అయితే చాలామంది వినియోగదారులకు తెలియని విషయం ఏమంటే తక్కువ ధరలకే ఇపుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన సేఫెస్ట్ కార్స్ మార్కెట్లో లభిస్తున్నాయి.ఇపుడు అలాంటి కార్ల గురించి తెలుసుకుందాం.

తాజాగా హ్యుందాయ్ తన ప్రసిద్ధ కారు i 10 నియోస్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయగా బాగా పాపులర్ అయింది.6 ఎయిర్‌బ్యాగ్‌లతో దేశంలోనే అత్యంత చౌక కార్లలో ఇది ప్రథమస్థానంలో వుంది.కారు యొక్క టాప్-ఎండ్ ఆస్ట్రా ట్రిమ్‌తో 6 ఎయిర్‌బ్యాగ్‌లు వస్తాయి.దీని ధర రూ.7.93 లక్షలు.ఇక దీని ఆరువాత మారుతి సుజుకి యొక్క ‘హ్యాచ్‌బ్యాక్ బాలెనో’ కారు గురించి చెప్పుకోవాలి.

Telugu Air Bags, Hyundai Creda, Hyundai Neos, Hyundai, Kia Carens, Kia Seltos, L

ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లతో, జీటా వేరియంట్ ఈ సేఫ్టీ ఫీచర్‌ను కలిగి వుంది.దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.33 లక్షలు. ఆ తరువాత హ్యుందాయ్ కంపెనీ యొక్క ‘సెడాన్ ఆరా’ గురించి చెప్పుకోవచ్చు.

ఈ కారులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి.ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.58 లక్షలు.ఈ లిస్టులో వున్న మరో కారు i20.హ్యుందాయ్ కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన కారు ఇది.ఇప్పుడు ఇది 6 ఎయిర్ బ్యాగ్‌లతో రూ.9.75 లక్షలకు అందుబాటులో మార్కెట్లో ఉంది.

Telugu Air Bags, Hyundai Creda, Hyundai Neos, Hyundai, Kia Carens, Kia Seltos, L

తరువాత Kia Carens గురించి చెప్పుకోవాలి.ఈ కారు ధర రూ.10 లక్షలుగా వుంది.ఇక హ్యుందాయ్ యొక్క ‘SUV క్రెడా’ కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ ఫీచర్‌గా కలిగి ఉండి, రూ.10.64 లక్షల ధరను కలిగి ఉంది.ఇదే లిస్టులో చెప్పుకోదగ్గ మరో కారు ‘Kia Seltos.

ఇప్పుడు కియా సెల్టోస్‌లో కూడా కంపెనీ 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించింది.ఈ మిడ్ సైజ్ SUV రూ.10.69 లక్షలకు అందుబాటులో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube