సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా రాణిస్తున్న చాలామంది ఒకానొక సమయంలో అనేక కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారు.చాలామంది చేతుల్లో అవమాన పాలవ్వడంతో పాటు, ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొన్న వారు చాలామంది ఉన్నారు.
అలాంటివారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్నారు.అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న కొంతమంది హీరోలు కూడా ఒకప్పుడు ఎన్నో రకాల అవమానాలను ఎదుర్కొన్నారట.
ఇంతకీ ఆ హీరోలు ఎవరు? ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారు అన్న విషయానికి వస్తే.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) కూడా సమయంలో అవమానాలను ఎదుర్కొన్నారట.కెరిర్ మొదట్లో నేను హీరో అవుతాను అనడంతో ముఖం మీద అన్ని మచ్చలు వేసుకొని నువ్వు హీరో అవుతావా అంటూ చాలా దారుణంగా అవమానించారట.అలాగే హీరో నటుడు ఉపేంద్ర( Upendra ) అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు ఒకసారి భోజనం చేయడానికి వెళ్ళగా అక్కడ ఉన్న ఒక ప్రొడక్షన్ బాయ్ అన్నం లేదు ఏమీ లేదు పోరా అంటూ చాలా ఇన్సల్టింగ్ కసురుకున్నట్టుగా మాట్లాడారట.
అలాగే సొంతం సినిమాలో మొదట హీరో అని చెప్పి అడివి శేష్ ను( Adivi Sesh ) తీసుకొని రెండు మూడు రోజులు షూటింగ్ జరిగిన తర్వాత అవసరం లేదు అని వెళ్ళిపోమని చెప్పారట.
సినిమా అయిపోయింది వెళ్ళిపోమని అడవి శేషుకి చెప్పారట.ఆ తర్వాత అర్థమైన విషయం ఏమిటంటే అది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే హీరో రోల్ కాదు అని అర్థం చేసుకున్నారట.అలాగే హీరోయిన్ నయనతార( Nayanthara ) ఒకసారి అవార్డు తీసుకోవడానికి వేదిక పైకి వెళ్ళగా తన భర్త విఘ్నేష్ శివన్ తో పాటు పక్కన అల్లు అర్జున్( Allu Arjun ) కూడా ఉన్నారట.
అప్పుడు అల్లు అర్జున్ చేతుల మీదుగా తీసుకోకుండా పక్కనే ఉన్న తన భర్త చేతుల మీదగా తీసుకోవడం ఇష్టం అని చెప్పడంతో అల్లు అర్జున్ అవమానాన్ని నవ్వుతూనే స్వీకరించారు.