తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తన కంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఆయన చేసిన తక్కువ సినిమాలతోనే చాలా ఎక్కువ ఇమేజ్ ను అయితే సంపాదించుకున్నాడు.ఇక అదే విధంగా ఆయనకి అభిమానులతో పాటుగా ఆయనని దేవుడిగా కొలిచే ఫ్యాన్స్ కూడా ఉండడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.
ఇక చిరంజీవి( Chiranjeevi ) తమ్ముడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మంచి సినిమాలు చేసి గొప్ప ఇమేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇప్పుడు అన్నకు తగ్గ తమ్ముడి గా ఎదగడమే కాకుండా చిరంజీవిని బీట్ చేసేంత క్రేజ్ ను కూడా సంపాదించుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమాతో( Khushi movie ) సూపర్ డూపర్ సక్సెస్ ని అందించిన హీరోయిన్ భూమిక.
అయితే పవన్ కళ్యాణ్ భూమిక జంట స్క్రీన్ మీద చూడచక్కగా ఉందని చాలామంది వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అయినప్పటికీ పవన్ కళ్యాణ్ భూమిక( Bhumika ) కలిసి మరొక సినిమా అయితే చేయలేదు.దానికి కారణం ఏంటి అంటే ఆమె చేసేంతా మంచి పాత్రలు దొరక్కపోవడమే దానికి కారణమని పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది…ఇక ఇదిలా ఉంటే జల్సా సినిమాతో పవన్ కళ్యాణ్ ఇలియానా ( Ileana )జోడి కి కూడా మంచి గుర్తింపూ వచ్చింది.
ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ వేరే లెవెల్ లో ఉంది అంటూ వార్తలు కూడా వచ్చాయి.అయినప్పటికీ వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా అయితే రాలేదు.
దానికి కారణం పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చిన సినిమాల్లో ఎవరు ఇలియానా పేరుని సజెస్ట్ చేయలేదంట దానివల్ల నెక్స్ట్ సినిమాలో ఇలియానాను తీసుకునే అవకాశం రాలేదట.ఇక పవన్ కళ్యాణ్ తనతో పాటు బెస్ట్ జోడి గుర్తింపు పొందిన ఈ ఇద్దరిని మళ్లీ రిపీట్ చేయకపోవడం కొంతవరకు పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశకు గురి చేసిందనే చెప్పాలి…
.