రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈనెల 8న వేములవాడకు మన భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా నాయకులు కార్యకర్తలు అభిమానులు అత్యధిక సంఖ్యలో తరలి రావాలని బిజెపి మండల అధ్యక్షుడు ఫోఃచెట్టి రాకేష్ పిలుపు నిచ్చారు .చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని పురగిరి క్షత్రియ సంఘంలో ఏర్పాటు చేసిన బూతు స్థాయి సన్నిహిత సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 8న వేములవాడకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా వేములవాడ రాజన్న దర్శించుకొని అనంతరం అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న బిజెపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ,కార్యకర్తలు, అభిమానులు, భూత అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.