బుల్లితెర ప్రముఖ యాంకర్లలో ఒకరైన సుమకు వయస్సు పెరుగుతున్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.సుమ కీలక పాత్రలో తెరకెక్కిన జయమ్మ పంచాయితీ సినిమా ఈ నెల 22వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
జయమ్మ పంచాయితీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ కనకాల తాజాగా జబర్దస్త్ షోకు హాజరయ్యారు.ఈ షోలో సుమ తన సినిమాలోని హీరోహీరోయిన్లను తీసుకొని వచ్చారు.
సుమ పాట వింటూనే పెరిగానని మనో చెప్పగా బాగా పెరిగారులేండి నా పాట వింటూ అంటూ సుమ అదిరిపోయే ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారు. రీతూ చౌదరి మమ్మీ వీడిని చూస్తే కంపరంగా ఉంది అని చెప్పగా నువ్వు అన్నిసార్లు మమ్మీమమ్మీ అని పిలిస్తే నాకు కూడా అలానే ఉంటుందనే సుమ అదిరిపోయే ఎక్స్ ప్రెషన్లు ఇచ్చి ఆకట్టుకున్నారు.
కమెడియన్ అదృష్టం అంటే ఏంటి సుమక్కా అని అడగగా జబర్దస్త్ కు రావడం నా అదృష్టం అని సుమ చెప్పారు.
మరి దురదృష్టం అంటే ఏమిటని కమెడియన్ అడగగా మీలాంటి జంటల్ని చూడటం నా దురదృష్టం అంటూ ఆమె చెప్పుకొచ్చారు.వెంకీ నా పేరు రాజీవ్ వెనకాల అని సుమ ఎప్పుడూ ముందే ఉంటుందని ఆవిడ ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ వెళ్లి ఆయన వెనకాల ఉన్నాను కాబట్టి నాపేరు రాజీవ్ వెనకాల అని వెంకీ అన్నారు.తాగుబోతు రమేష్ స్కిట్ ను చూసి సుమగారిలా భలే చేశారని రోజా చెప్పగా సుమ మీరేంటండి నన్ను గారు అంటున్నారని అడుగుతారు.
నేను మీకంటే 15 ఏళ్లు చిన్న అని చెప్పగా రోజా నవ్వూ నేను హీరోయిన్ గా వచ్చినప్పుడే సుమ ఇండస్ట్రీకి వచ్చిందని వచ్చిందని రోజా అన్నారు.సేమ్ టూ సేమ్ అంటూ రోజా సుమ పరువు తీసేశారు.
సుమ ముఖం మాడిపోయేలా రోజా పంచ్ లు వేశారు.హైపర్ ఆది లేకపోయినా జబర్దస్త్ ప్రోమో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.