వామ్మో! అక్కడ ఒక బిందె నీళ్ల ధర రూ. 1.30 లక్షలు.. అసలు మ్యాటర్ ఏంటంటే.!

హిందూ ధర్మంలోని కొన్ని విషయాలు కొంతమందికి మూఢనమ్మకాలుగా కనిపించొచ్చు, కానీ వారికి మాత్రం అవి చాలా సెంటిమెంట్.అవును.

 The Price Of A Drop Of Water There Is Rs. 1.30 Lakhs The Real Matter Is, One Wa-TeluguStop.com

ఇపుడు ఈ విషయాన్ని గమనిస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుంది.అక్కడ ముక్తేశ్వర ఆలయంలో ఉన్న ప్రసిద్ధ మరీచి ‘కుండ’ (చెరువు నుండి తీసిన పవిత్ర జలం) మొదటి బిందె వేలంలో రు.1.30 లక్షలు పలికింది.ఇక్కడ లింగరాజు వార్షిక రుకున రథ ఉత్సవాల ముందురోజు ఇలా పవిత్ర జలాన్ని వేలం వేయడం తరతరాలనుండి ఆనవాయితీగా వస్తోంది.ఇక్కడ ఈ పవిత్ర జలంలో స్నానం చేయడం వల్ల భక్తులలో సంతానోత్పత్తి సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు మరి.

ఇక పూర్తి వివరాలు పరిశీలించినట్లయితే, ఒడిశా భువనేశ్వర్లోని ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న మరీచి గుండంలోని మొదటి బిందె నీటిని అక్షరాలా రూ.1.30 లక్షలకు విక్రయించారు.లింగరాజస్వామి రుకున యాత్రలో భాగంగా ఇక్కడ ప్రతి సంవత్సరం అశోక అష్టమి ముందు రోజు రాత్రి మరీచి గుండంలోని నీటిని విక్రయించేందుకు వేలం నిర్వహించడం ప్రతీతి.

ఇక దీన్ని లింగరాజ ఆలయంలో ఉండే బడునియోగ్ వర్గానికి చెందిన సేవాయత్లు నిర్వహిస్తారు.మొన్న శుక్రవారం రాత్రి అక్కడ వేలంపాట జరగగా.తొలి బిందె నీటి ధర రూ.25 వేలతో ప్రారంభ ధరతో మొదలయ్యింది.

కాగా ఆ మొదటి బిందెను భువనేశ్వర్ లోని బారాముండా ప్రాంతానికి చెందిన దంపతులు రూ.1.30 లక్షలకు కొనుగోలు చేసారు.అలాగే 2వ బిందెను రూ.47 వేలుకి కొనగా, 3వ కుండను 13 వేలకు భక్తులు కొనుగోలు చేసారు.మిగిలిన నీటిని పేద దంపతులకు ఉచితంగా అక్కడ పంపిణీ చేశారు.

ఈ నీటితో స్నానంచేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అక్కడి భక్తుల విశ్వాసం.ఆ నీరు విశేషత ఏమంటే అక్కడ గుండం చుట్టుపక్కల ఉన్న అశోక చెట్ల వేర్ల ప్రభావంతో ఆ నీటిలో ఔషధ గుణాలుంటాయని స్థానికులు నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube