కేఏ పాల్ బలమెంత ? మునుగోడు లో గద్దర్ కు కలిసొచ్చేదెంత ? 

2019 ఎన్నికలకు ముందు నుంచి ప్రజాశాంతి పార్టీ పేరుతో ఏపీలో హడావుడి చేసి ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులను దింపిన ఆ పార్టీ అధినేత కేఏ పాల్ సరిగ్గా పోలింగ్ సమయం దగ్గర పడుతున్న సమయంలో తాను పోటీ నుంచి విరమించుకుంటున్నా అని ప్రకటించి సంచలనం సృష్టించారు.అయినా ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ యాత్రలు చేపడుతూ రాజకీయ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

 How Strong Is Ka Paul  How Much Did Gaddar Get In The Munugoḍu ,ka Paul, Praja-TeluguStop.com

తనకు అధికారం కట్టబడితే లక్షకోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ప్రకటనలు చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సవాళ్లు విసురుతూ వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నారు.ఇక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలపై కేఏ పాల్ దృష్టి పెట్టారు.

అక్కడే అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
  అయినా ఆ పార్టీ ప్రభావం ఏ మాత్రం ఉండదని,  మిగతా పార్టీలన్నీ ధీమా ఉండగా ,అనూహ్యంగా నిన్న ప్రజాశాంతి పార్టీలో విప్లవ గాయకుడు గద్దర్ చేరారు.

అంతేకాదు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కె పాల్ కు చెందిన ప్రజా శాంతి పార్టీ నుంచి గద్దర్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.గద్దర్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది.

ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నా,  ఇటీవల కాలంలో రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోది హైదరాబాదులో నిర్వహించిన సమావేశానికి హాజరై గద్దర్ సంచలనం రేపారు.ఆయన బిజెపిలో చేరుతున్నారని అప్పుడే ప్రచారం జరగగా,  కొద్ది రోజులకే కాంగ్రెస్ నేతలతోనూ భేటీ అయ్యారు.

దీంతో ఆయన ఏ పార్టీలో చేరాలనే విషయంపై క్లారిటీ లేదని అంత భావిస్తుండగా,  అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా తెలంగాణలో ఏమాత్రం ప్రభావం లేని ప్రజాశాంతి పార్టీలో గద్దర్ చేరారు.
 

ఆ పార్టీ తరఫున మునుగోడు నుంచి గద్దర్ పోటీ చేసినా, ప్రధాన పార్టీల ల  ప్రభావం ఏమి ఉండదు. పాల్ పార్టీ ప్రజల్లో పెద్దగా గుర్తింపు పొందకపోవడమే దీనికి కారణం.వ్యక్తిగతంగా గద్దర్ కు మంచి పేరు ప్రఖ్యాతలు ఉండడంతో కొన్ని ఓట్లను సాధించే అవకాశం ఉంది.

అంతేకాకుండా వామపక్ష పార్టీలు ఇ ప్పటికీ టిఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి.దీంతో ఆ పార్టీల మద్దతు గద్దర్ కు ఉండే అవకాశం లేదు  కాకపోతే వాము పక్ష  పార్టీలో ఉన్నవారు , ఆ పార్టీ ఓటర్లు ఎంతమంది టిఆర్ఎస్  ఓటు వేస్తారనేది ప్రశ్నార్థమే.

ఈ క్రమంలోనే వామపక్ష భావజాలం ఉన్న గద్దర్ కు ఆయా పార్టీల మద్దతుదారుల నుంచి ఓట్లు పడే అవకాశం కనిపిస్తోంది.కానీ ప్రధాన పార్టీలైన బిజెపి టిఆర్ఎస్,  కాంగ్రెస్ లకు పోటీ ఇచ్చే స్థాయిలో  అయితే పాల్ ప్రభావం కానీ,  గద్దర్ ప్రభావం కానీ ఉండకపోవచ్చు అనేది విశ్లేషకులు అంచనా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube