ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది.ఈ మేరకు రేపు ఉదయం 10 గంటలకు ఏఐసీసీలో కీలక సమావేశం నిర్వహించనుంది.
ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ సహా ఏపీలోని పలువురు ముఖ్యనేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో నేతలతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ భేటీ కానున్నారు.
ఇందులో ప్రధానంగా ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.అలాగే తదుపరి కార్యాచరణపై పార్టీ హైకమాండ్ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.