కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ఒకరు.ఈయన తమిళ్ లో రజినీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ సంపాదించుకుని కోలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు.
ఈయనకు తెలుగులో కూడా ఒక మాదిరిగా మార్కెట్ అయితే క్రియేట్ అయ్యింది.ఈయన నటించిన ప్రతీ సినిమా డబ్ అయ్యి తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో ఇక్కడ కూడా విజయ్ కు ఫాలోయింగ్ ఉంది.
ఇక తాజాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘వారసుడు‘ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా తర్వాత విజయ్ నెక్స్ట్ సినిమా కూడా వెంటనే లైన్లో పెట్టాడు.
మాస్టర్ వంటి సినిమాను తెరకెక్కించి విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ తో దళపతి 67 సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా మొన్ననే గ్రాండ్ గా చెన్నైలో స్టార్ట్ చేసారు.

ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించారు.అలాగే సంజయ్ దత్ విలన్ రోల్ ప్లే చెయ్యనున్నారు.ఇదిలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ మీద అప్పుడే అంచనాలు భారీగా పెరిగాయి.అసలు షూటింగ్ కూడా స్టార్ట్ కాకుండానే ఈ సినిమాకు గట్టి డిమాండ్ ఏర్పడింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది.

ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ 160 కోట్ల రుపాయలకు ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టు.అలాగే దళపతి విజయ్ సాటిలైట్ హక్కులను సన్ టీవీ సంస్థ 80 కోట్లకు సొంతం చేసుకున్నట్టు ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఇదే కనుక నిజమైతే ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు కూడా ఇంత బిజినెస్ జరగలేదు అనే చెప్పాలి.
కాగా సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.







