ఇవాళ తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది.హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీని నిర్వహించనున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ఏఐసీసీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.పీసీసీ కార్యవర్గ సభ్యులు, డీసీసీ అధ్యక్షులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల ఛైర్మన్లు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు భవిష్యత్ లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా నేతలు చర్చించనున్నారు.