రష్యా, ఉక్రెయిన్ కొట్టుకు చస్తుంటే, చైనా ( China ) వచ్చిన నష్టమేమిటని అనుకుంటున్నారా? విషయం తెలుసుకోవాలనుకుంటే ఈ పూర్తి కధనం చదవాల్సిందే.విషయం దేవుడికెరుకగానీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి మొదట్లోనే ఫ్రాన్స్, టర్కీ దేశాలు ప్రయత్నించాయని భోగట్టా.
వీటితో పాటు చిన్నా చితకా దేశాలు కూడా వీటి మధ్య యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయిందని సమాచారం.ఇక ఈ మధ్యన రష్యా ఉక్రెయిన్( Russia Ukraine War ) మధ్య యుద్ధాన్ని ఆపడానికి చైనా నేనున్నాను అంటూ ప్రయత్నిస్తున్నట్లుగా ప్రకటిస్తోంది.
ఆ మధ్యన భారతదేశాన్ని యుద్ధం విషయంలో కలుగజేసుకోవాలని యుక్రెయిన్ అధ్యుక్షుడు జెలెన్స్కి( Zelensky ) అడిగిన సంగతి అందరికీ తెలిసినదే.అయితే, భారత్ పెద్దగా కలుగజేసుకోకుండా మీరు ఇద్దరు కలిసి తేల్చుకుంటే సమస్య సమసిపోవునని సలహా ఇచ్చింది.అయితే భారత్ అలా అనడానికి కారణం వుంది.రేపు ఈ దేశాలు ఏవి కాశ్మీర్ విషయంలో కలగజేసుకోకూడదని భారత్ ప్లాన్ కావచ్చు.ఇక చేసేదేమిలేక యుక్రెయిన్ చైనాతోనే మన్ననలు జరుపుతోంది.
ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జింపింగ్ పుతిన్ తో సమావేశం అయ్యారు.అక్కడ జింపింగ్ ఏం వెలగబెట్టాడో ఏమోగానీ, ఆ మీటింగ్ లో చాలా అంశాలు చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.రష్యా అధ్యక్షుడు ఈ సదరు విషయాలపైన జింపింగ్ తో చాలా తీవ్రస్థాయిలో చర్చినట్టు తెలుస్తోంది.
అయితే అన్ని విషయాలు నచ్చిన పుతిన్ కి యుక్రెయిన్ విషయం మాత్రం రుచించలేదట.ఈ క్రమంలో రష్యా, చైనా మధ్య సంబంధాలు చేసినట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి.దాంతో ఇరుదేశాల మధ్య కొన్ని వాణిజ్య సంబంధాలు చెడినట్టు తెలుస్తోంది.కడకు చైనా ఎరక్కపోయి ఇరుక్కున్నాం కదాని, వైపు తడుముకున్నాయట!
.