పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా చేస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్’( Adipurush movie ) ఒకటి.తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయ్యింది.
వచ్చే నెల గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను ఇస్తూ మరింత క్రేజ్ పెంచుతున్న విషయం తెలిసిందే.

రామాయణం( Ramayanam ) ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా.బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్( Kriti sanon ) సీతగా నటించింది.
అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.
ఈ సినిమా ప్రకటించినప్పుడు ఏర్పడిన అంచనాలు టీజర్ రిలీజ్ తో పోయాయి.మళ్ళీ ఒక్కో అప్డేట్ ఇస్తూ ఈ మధ్యనే పాజిటివ్ గా మారుస్తున్నారు.ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసి అంచనాలు భారీగా పెంచగా తాజాగా జై శ్రీరామ్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ కు కూడా ఆడియెన్స్ నుండి భారీ స్పందన లభించింది.

ఇది ప్రజెంట్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.24 గంటల్లోనే 45 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ అందుకుంది.దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి జై శ్రీరామ్ 45 మిలియన్ల వ్యూస్ తెచ్చుకోవడం.అది కూడా 24 గంటల్లోనే అన్ని వ్యూస్ రావడం తొలిసారి అనే చెప్పాలి.
ఇక జూన్ 16న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.







