గత ఏడాది నున్న పీఎస్ పరిధిలో విశాఖకు చెందిన బిల్డర్ హత్య విషయం అందరికీ తెలిసినదే అయితే, అప్పలరాజు హత్య కేసులో పోలీసులు మిస్టరీ చేధించారు , బిల్డర్ అప్పలరాజు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా ఇందులో భాగంగా ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఐదుగురు నిందితులను విచారణ చేపట్టిన తర్వాత బిల్డర్ అప్పలరాజు కుటుంబ సభ్యులతో కలిసి అతని దగ్గర పని చేస్తున్న సూపర్వైజర్ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేశారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ప్రకారం బిల్డర్ అప్పలరాజు పై విషప్రయోగం జరిగినట్లు పోలీసులు విచారణలో తేలింది.