ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కారు సీతాగొంది వద్ద కంటెయినర్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు.వీరిలో ముగ్గురు పురుషులు, ఓ మహిళ ఉన్నారు.
ప్రమాదంలో మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన మహిళను రిమ్స్‌కు తరలించారు.మృతులను ఆదిలాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.







