ప్రాంతీయ పార్టీగా పుట్టి జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించనున్నారు.ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ సర్వసభ్య సమావేశం జరగనుంది.హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లా పరిషత్, డీసీసీబీ ఛైర్మన్ లు హాజరుకానున్నారు.
కాగా బీఆర్ఎస్ గా మారిన తరువాత నిర్వహిస్తున్న మొదటి జనరల్ బాడీ మీటింగ్.ఇందుకోసం మొత్తం 279 మంది పార్టీ ప్రతినిధులకు ఆహ్వానాలు అందగా.
ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను బీఆర్ఎస్ ప్రవేశపెట్టనుంది.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.
ఈ మేరకు పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.