గుండె జబ్బుల బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.వయసు పైబడిన వారే కాదు.
యువత గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారు.రకరకాల కారణాల వల్ల గుండె వ్యాధులు దరి చేరుతుంటాయి.
కొందరికి వారసత్వంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.అలాగే తెలుసో, తెలియకో మనం రోజూవారి చేసే తప్పులు కూడా గుండెకు ముప్పుగా మారుతుంటాయి.
మరి ఆ తప్పులు ఏంటో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
లేట్ నైట్ స్లీప్.
ఇటీవల కాలంలో చాలా మంది దీనికి అలవాటు పడిపోయారు.ఫోన్లు, టీవీలు చూస్తూ ఎప్పుడో పదకొండు, పన్నెండు గంటలకు నిద్ర పోతుంటారు.
అయితే గుండె జబ్బులు రావడానికి ఇదీ ఒక కారణంగా చెప్పుకొచ్చు.నిద్ర సమయాన్ని వృధా చేయడం వల్ల శరీరం తీవ్రంగా అలసిపోవడంతో పాటుగా గుండె ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది.
అందుకే త్వరగా నిద్ర పోవడాన్ని అలవాటు చేసుకోవాలి.
ధూమపానం, మద్యపానం ఈ రెండూ గుండె ఆరోగ్యాన్ని చెడ గొట్టడంలో మరియు అనేక గుండె సంబంధిత వ్యాధులు దరి చేరేలా చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
కాబట్టి, మీకు గనుక ఈ అలవాట్లు ఉంటే.కష్టమైనా, ఇష్టం లేకున్నా వదులుకోవాల్సిందే.
కొందరు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనూ లేదా ఇతరితర కారణాల వల్లో ఎక్కువ గంటలు పని చేస్తుంటారు.అయితే ఎక్కువ గంటలు పనిచేయడం కూడా గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది.
బరువును అదుపులో ఉంచుకోకపోవడం కూడా గుండె వ్యాధులు రావడానికి ఒక రీజన్‌గా చెప్పొచ్చు.బరువు తక్కువ ఉన్న వారితో పోల్చుకుంటే.అధిక బరువు ఉన్న వారినే గుండె జబ్బులు ఎటాక్ చేస్తుంటాయి.
ఈ మధ్య పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ జంక్ ఫుడ్‌కు అలవాటు పడిపోయారు.అయితే జంక్ ఫుడ్‌ను తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అమాంతం పెరుగుతుంది.దాంతో గుండె జబ్బులు వచ్చే రిస్క్ కూడా పెరిగిపోతుంది.
అలాగే కొందరు ఏదో ఒక కారణం చేత తరచూ ఒత్తిడికి గురవుతుంటారు.అయితే గుండెకు పెద్ద శత్రువు ఒత్తిడే.
కాబట్టి, ఒత్తిడిని ఎంత అదుపులో ఉంచుకుంటే.గుండె అంత ఆరోగ్యంగా ఉంటుంది.