ఆగష్టు 21 న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు కేజిఫ్ చాప్టర్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మీ జీ తెలుగు లో

హైదరాబాద్, ఆగష్టు 12, 2022: ఎప్పటికప్పుడు వరుస వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ తో మరియు సరికొత్త ఫిక్షన్, నాన్-ఫిక్షన్ షోలతో ప్రేక్షకులను వినోదాన్ని పంచుతున్న ‘జీ తెలుగు’, ఇప్పుడు మరో శుభవార్తతో తమ వీక్షకుల ముందుకు వచ్చేసింది.అదే, కేజిఫ్ చాప్టర్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ దేశవ్యాప్తంగా పలు భాషలలో రీలీజై కోట్లాది మంది మనస్సులు గెలుచుకుని బాక్సాఫీస్ సునామి సృష్టించిన ఈ కల్ట్ సినిమా, ఆగష్టు 21న (ఆదివారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రసారం కానుంది.ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా మెప్పించింగా, సంజయ్ దత్, రవీనా టండన్, మరియు ప్రకాష్ రాజ్ ప్రముఖ పాత్రలలో అద్భుతమైన నటన కనబరిచి అందరిని ఆకట్టున్నారు.కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ని తన ఆధీనంలోకి తెచ్చుకుని, అనేక ప్రతికూలతలను ఎదుర్కొని తన ఆదిపత్యాని చాటుతూ వస్తున్న రాకీ (యష్) కి ప్రధాన మంత్రి రమికా సేన్ (రవీనా టండన్) మరియు అధీర (సంజయ్ దత్) రూపంలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది.

 World Television Premiere Of Kgf: Chapter 2 On 21st August At 5:30 Pm, Only On-TeluguStop.com

వీరి మధ్య జరిగే సంఘటనలు, రాకీ వారిని ఎదుర్కొనే విధానం ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.

అయితే, కేజిఫ్ చాప్టర్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మరియు ప్రీమియర్ యొక్క తేదీని ప్రకటిస్తూ, ‘జీ తెలుగు‘ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఆగష్టు 11న 100 అడుగుల కేజిఫ్ చాప్టర్ 2 పోస్టర్ ని హైటెక్ సిటీ లోని శిల్పారామం సమీపంలోని క్లౌడ్ డైనింగ్ నుండి మీడియా మరియు ప్రేక్షకుల సమక్షంలో ఆవిష్కరించి ఒక అద్భుతమైన ఫీట్ ను సాధించింది ‘జీ తెలుగు’.దేశచరిత్రలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన రెండో అతిపెద్ద చిత్రం కేజిఫ్ చాప్టర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube