జూనియర్ ఎన్టీఆర్( NTR ) ప్రజెంట్ గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న క్రమంలో ఈయన భారీ లైనప్ ను కూడా సెట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాడు.ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా( Devara movie ) ) చేస్తున్నాడు.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఈయన తన నెక్స్ట్ మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే.అందుకే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితతాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమా మల్టీస్టారర్ అని ఎన్టీఆర్ తో పాటు మరో పాన్ ఇండియా స్టార్ కూడా ఈ సినిమాలో నటిస్తాడని టాక్ వినిపిస్తుంది.అంతేకాదు సలార్ సినిమా లాగానే ఈ సినిమాను కూడా నీల్ రెండు పార్టులుగా తీయాలని అనుకుంటున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ వార్తల్లో ప్రజెంట్ ఎలాంటి నిజం లేకపోయినా నెట్టింట మాత్రం ఫుల్ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా కూడా ప్రియాంక చోప్రా నటించనుంది అని టాక్ రాగా ఇంకా నీల్ ఎవరిని ఫైనల్ చేయలేదు.ప్రస్తుతం నీల్ సలార్ సినిమా తోనే బిజీగా ఉన్నాడు.ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అయితే కానీ ఎన్టీఆర్ సినిమాపై ఫోకస్ పెట్టె అవకాశం ఉంది.ప్రశాంత్ నీల్ ( Prashanth Neel )ఇప్పటికే ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసాడని ఇండియా పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం.
చూడాలి మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.







