రండి బాబు రండి… ఆలోచించినా ఆశాభంగం.ఒకటి కొంటే ఒకటి ఫ్రీ .
ఏంటి ఏదో విషయం చెప్తారు అనుకుంటే ఇంకేదో చెప్తున్నారు అని అనుకుంటున్నారా ? ఖచ్చితంగా లైన్లోనే ఉన్నామండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu Film Industry )లో ఇప్పుడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనే రూల్ నడుస్తోంది.
సినిమా ప్రొడక్షన్స్ ఆఫీసులలో ఒక సినిమాలో నటించిన హీరోయిన్ అదే ఆఫీసులో మరో మూడు నాలుగు సినిమాలకు సైన్ చేస్తే ఇంకా ఏమంటారో చెప్పండి.ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) లో ఇదే ట్రెండ్ నడుస్తోంది.
ఒక సినిమాలో నటించడానికి వచ్చిన హీరోయిన్ కు మరో ఒకటో రెండో అవకాశాలు కచ్చితంగా ఇస్తున్నారు సదరు సినిమా మేకర్స్.మరి అలా ఏకులా వచ్చి మేకులా దిగిపోయిన ఆ స్టార్ హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆదికేశవ సినిమాకు సితార బ్యానర్ లో శ్రీ లీల( Sreeleela ) హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలో నటిస్తున్న క్రమంలోనే గుంటూరు కారం సినిమా కోసం అదే బ్యానర్ లో మరో హీరోయిన్ గా నటించింది ఈ అమ్మడు.ఇక గుంటూరు కారంలో రెండవ హీరోయిన్ గా నటించింది మీనాక్షి చౌదరి.ఇక గుంటూరు కారంలో నటించిన మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary )కి మళ్లీ అదే సితార బ్యానర్ లక్కీ భాస్కర్ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కి జోడిగా అవకాశం ఇచ్చారు.వరుణ్ తేజ్ మట్కా సినిమాలో మీనాక్షి చౌదరి ఇప్పటికే నటిస్తుండగా ఈ సినిమా నిర్మిస్తున్న బ్యానర్ లోనే విశ్వక్సేన్ తో మరో చిత్రంలో కూడా మీనాక్షి కన్ఫమ్ అయ్యింది.
హీరోయిన్ నేహా శెట్టి సితార బ్యానర్ లో మొదట డీజే టిల్లు అనే చిత్రంలో నటించగా ఇదే బ్యానర్లో వస్తున్న విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో కూడా నేహా శెట్టి నే హీరోయిన్ గా తీసుకున్నారు.

అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) సైతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒకటికి రెండు సినిమాలు చేసి పెడుతున్నారు.మొదట కార్తికేయ సీక్వెల్లో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత ఈగల్ లో కూడా హీరోయిన్ గా నటించింది.ఇప్పుడు టిల్లు స్క్వైర్ లో కూడా ఆమెనే హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాను సితార బ్యానర్స్ నిర్మిస్తుండగా ఇంతకన్నా ముందు ప్రేమమ్, అ ఆ సినిమాలలో కూడా అనుపమ నటించింది.దిల్ రాజు బ్యానర్ లో మొదట సరిలెరు నీకెవ్వరు చిత్రంలో నటించిన రష్మిక( Rashmika Mandanna )ను ఆ తర్వాత వారసుడు సినిమాలో కూడా కంటిన్యూ చేశారు.
ఇక డియర్ కామ్రేడ్ సినిమాలో నటించిన తర్వాత ఈ అమ్మడికి పుష్ప మరియు పుష్ప 2 సినిమాల్లో అవకాశం ఇచ్చారు మైత్రి మూవీస్( Mythri Movies ) వారు.సితారలో సారొచ్చారు, భీమ్లా నాయక్ వంటి సినిమాల్లో సంయుక్త మీనన్ వరుసగా నటించారు.
డివివి బ్యానర్స్ లో కియారా అద్వానీ భరత్ అనే నేను వినయ విధేయ రామ వంటి రెండు చిత్రాల్లో నటించగా, ప్రియాంక మోహన్ మొదట గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించిందిం ఇప్పుడు సరిపోదా శనివారం, OG చిత్రాల్లో నటిస్తుంది.జాన్వి కపూర్ రామ్ చరణ్ 16వ సినిమాలో నటిస్తుండగా పుష్ప సినిమా కోసం కూడా తీసుకున్నారు మేకర్స్.
ఇక బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) అదే బ్యానర్లో మరో చిత్రంలో నటిస్తుంది.