రష్యా దూకుడికి బెంబేలెత్తిపోతున్న నాటో దేశాలు... పాపం ఉక్రెయిన్!

అవును, రష్యా దూకుడికి నాటో దేశాలు( NATO Countries ) హడాలిపోతున్న పరిస్థితి.ఇక వాటినే నమ్ముకున్న ఉక్రెయిన్ దేశం( Ukraine ) మాత్రం రోజురోజుకీ భంగపాటుకి గురవుతోంది.

 Can Us And Nato Provide Ukraine With Enough Weapons Details, Russia, Nato Countr-TeluguStop.com

నాటో దేశాలు రష్యా( Russia ) మీదకి ఉక్రెయిన్ ని బాగానే ఉసిగొలిపాయి గానీ ఉక్రెయిన్ కి ఇస్తామన్న యుద్ధ సామాగ్రి మాత్రం ఇవ్వడంలేదు.తమ దగ్గర మిగిలిపోయిన స్క్రాప్ లాంటి యుద్ద ట్యాంకుల్ని, కొన్ని యుద్ధ విమానాలని అందిస్తున్నాయి.

దానివల్ల ఉక్రెయిన్ ఈ యుద్ధంలో వెనుకబడిపోయింది.మరో పక్క రష్యా మంచి స్పీడుగా దూసుకుంటూ పోతుంది.

Telugu America, International, Latest, Nato, Pentagon, Putin, Russia, Ukraine, W

అటువంటి స్క్రాప్ యుద్ధ పరికరాల కారణంగా ఉక్రెయిన్ మూల్యం చెల్లించుకుంటోంది.అక్కడ అనేక సైనికులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి వుంది.అయితే ఈ క్రమంలో నాటో దేశాలకు సంబంధించిన ఆయుధ కారాగారాలు కూడా ఖాళీ అయిపోవడం కొసమెరుపు.న్యూయార్క్ టైమ్స్ ప్రకారం… ఉక్రెయిన్స్ పశ్చిమ పొత్తులు ఆయుధాల వాగ్దానాలను నెరవేర్చడానికి తెగ కష్టపడినట్టు గుసగుసలు వినబడుతున్నాయి.

న్యూయార్క్ టైమ్స్ ద్వారా లీకైన పెంటగాన్ పత్రాలు నాటో కూటమిల యుద్దాలలో, యుద్ధ ట్యాంకులు ఇంకా ఫిరంగి వ్యవస్థల యుద్ధాన్ని తగ్గించే ప్రతిజ్ఞను నెరవేరుస్తున్నాయని వెల్లడిస్తున్నాయి.

Telugu America, International, Latest, Nato, Pentagon, Putin, Russia, Ukraine, W

రాబోయే కొన్ని నెలలలో ఉక్రెయిన్, యుద్ధాన్ని పూర్తి చేయకపోతే ఉక్రెయిన్ ని రష్యా పూర్తిగా ఆధీన పరుచుకొనే పరిస్థితి లేకపోలేదు.నాటో దేశాలన్నీ యుద్ధ ట్యాంకులు ఇస్తామన్నాయి, అదేవిధంగా యుద్ధ పరికరాలను కూడా ఇస్తామన్నాయి.కానీ వాళ్లు ఇచ్చినవి ఇచ్చినట్లుగా అయిపోతున్న తరుణంలో, వాళ్ళ కంపెనీలన్నిటిలో, ఆయుధాల కర్మగారాలలో 24 గంటలూ పని చేసినా కూడా ఆయుధాలను సప్లై చేసే విషయంలో సాటిస్ఫైడ్ రేంజ్ కి రీచ్ అవ్వలేక పోవడం కొసమెరుపు.

మొత్తంగా రష్యా దూకుడిని నాటో దేశాలు సైతం ఊహించలేదు.దాంతో పెద్దన్న అమెరికా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube