ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు పెళ్లిళ్లు అంటే ఓ ఆటల కనిపిస్తుంటుంది.ఇప్పటికే ఎంతో మంది నటులు ఎన్నో పెళ్లిళ్లు చేసుకొవడం, విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది.
అంతేకాకుండా వాటిని నేరుగా బయటికి చేసుకోవడం కూడా అలవాటుగా మారింది.ఇదిలా ఉంటే ఓ నటి మూడు పెళ్లిళ్లు చేసుకోగా మళ్లీ తన అసలైన భర్త గురించి కామెంట్స్ చేయడంతో బాగా వైరల్ గా మారింది.
ఇంతకీ ఆ నటి ఎవరంటే.
అమెరికన్ మోడల్, సినీనటి కిమ్ కర్దాషియన్.
నటిగానే కాకుండా నిర్మాతగా, బిజినెస్ ఉమెన్ గా బాగా గుర్తింపు తెచ్చుకుంది.అంతే కాకుండా విపరీతమైన ఫాలోయింగ్ కూడా పెంచుకుంది.
ఇక ఓ రియాల్టీ షో కూడా నిర్వహిస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా తన రియాల్టీ షో కి సంబంధించిన ఎపిసోడ్ లో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది.
కిమ్ గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకోగా ఇటీవల తన మూడో భర్త నుండి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.మొదట దామోన్ థామస్ ను వివాహం చేసుకొని ఆ తర్వాత విడిపోగా మళ్లీ అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ హంపెరిస్ ను రెండో వివాహం చేసుకుంది.
ఇక ఈ జీవితం కూడా ఎక్కువ కాలం నిలువక పోగా మూడోసారి అమెరికన్ ర్యాపర్ కన్యేయ్ వెస్ట్ ను వివాహం చేసుకుంది.

ఇక అతనితో కూడా విడాకులు కోరింది.ఇక తాజాగా కొన్ని విషయాలు మాట్లాడుతూ గతం గురించి తనకు అక్కర్లేదని, వెస్ట్ తో తన బంధం బలమైనదని తెలిపింది.ఇక తను అమేజింగ్ వ్యక్తి అని, అతనితో సిసలైన పెళ్లి గా భావిస్తానని తెలిపింది.
ఇక తన పిల్లల మీద తనకంటే అతనికి ఎక్కువ ప్రేమ ఉంటుందని ఎప్పటికీ అతనే తన వీరాభిమాని అనడమే కాకుండా అతను తన ఫ్యామిలీనే అని కామెంట్స్ చేసింది.

ఇక ఇది విన్న ఆయన అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.ప్రస్తుతం అతను రష్యన్ మోడల్ ఇరినా తో డేటింగ్ చేస్తున్నాడు.ఇక ప్రస్తుతం ఆయన ఆమెతో సంతోషంగా ఉండగా గతంలో కిమ్ చేసిన బాధను తట్టుకోలేక మానసికంగా ఎంతో కుమిలిపోయాడు.
ఇక ప్రస్తుతం వెస్ట్ సంతోషంగా ఉండడం తో కిమ్ ఓర్వలేక అలా మాట్లాడుతుందని తెగ కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.