గ్లోబల్ వార్మింగ్‌పై సందేశాత్మక వీడియో.. నెట్టింట వైరల్

ప్రజలు అనుసరించే ప్రకృతి విరుద్ధమైన వ్యవహార శైలి వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయి.ఇప్పటికే అడవుల నరికివేత పెరగడం, పచ్చదనం తగ్గడంలో సమయానికి వర్షాలు కురవడం లేదు.

 Powerful Message On Global Warming In Japan Viral On Social Media Details, Globa-TeluguStop.com

అంతేకాకుండా పలు ప్రకృతి విపత్తులు కూడా పెరుగుతున్నాయి.పచ్చదనం తగ్గడంతో ఓజోన్ పొరకు డ్యామేజీ జరుగుతోంది.

ఫలితంగా ఎండలు పెరిగి, అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో మంచు గణనీయంగా తగ్గుతోంది.సముద్ర మట్టం పెరిగి చాలా చోట్ల కోతకు గురవుతుంది.

దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి.భూతాపం పెరగడంతోనే ఈ దుష్పరిణామాలన్నీ జరుగుతున్నాయి.

ఈ క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు అందరికీ అవగాహన కల్పిస్తున్నాయి.అయితే జపాన్‌లో దీని కోసం రూపొందించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇటీవల జపాన్‌లోని ఓ సెంటర్‌లో ఓ తల్లి, ఆమె బిడ్డతో కూడిన విగ్రహాలు ఏరపాటు చేశారు.అయితే అందులోని తల్లి విగ్రహాన్ని మాత్రమే రాతితో చేశారు.ఆ చిన్నారి విగ్రహాన్ని మాత్రం మంచుతో తయారు చేశారు.బయట ఉండే ఎండకు ఆ విగ్రహం కొంచెం కొంచెంగా కరిగిపోతుంది.

ఫలితంగా కొంత సేపటికి ఆ చిన్నారి విగ్రహం ఏమీ కనిపించదు.ఇక ఆ విగ్రహాల వద్ద ఓ సందేశాత్మక సూక్తిని కూడా రాశారు.

గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్ అంతం కాబోతుంది అనే కొటేషన్‌ను రాశారు.అటుగా వెళ్లే వారంతా ఈ కొటేషన్‌ను చదువుతున్నారు.ఫలితంగా వారిలో గ్లోబల్ వార్మింగ్ పట్ల ఆలోచన పెరుగుతోంది.ఎన్నో వందల కొద్దీ ప్రసంగాల కంటే ఈ చిన్న చర్య చాలా మందిలో పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పిస్తోంది.

ఈ ఒక్క వీడియో ఎందరినో కదిలిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఆ చిన్నారి మంచు బొమ్మ ఎండకు కరిగిపోవడం ఎందరినో పర్యావరణ పరిరక్షణకు పాటుపడేలా చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube