తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో మరియు తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న ఘన చరిత కలిగిన ఘనుడు నందమూరి తారక రామారావు. ఇండస్ట్రీలో ఆయన పేరు చెప్పని రోజు ఉండదు.
తెలుగు రాజకీయాల్లో ఆయన ప్రస్థావన తీసుకు రాకుండా ముందు అడుగు పడదు.అలాంటి సీనియర్ ఎన్టీఆర్ వందవ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
ఏడాది పాటు వందవ జయంతి వేడుకలను నిర్వహించేందుకు నందమూరి బాలకృష్ణ మరియు కుటుంబ సభ్యులు కంకణం కట్టుకున్నారు.వచ్చే ఏడాది మే 28వ తారీకు వరకు జరగబోతున్న జయంతి వేడుకల్లో భాగంగా ఎంతో మంది సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
ఆ విషయాన్ని పక్కన పెడితే వందవ జయంతి సందర్బంగా నందమూరి తారక రామారావును కోట్లాది మంది తలచుకున్నారు.తెలుగు ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ ను యాది చేసుకున్నారు.
సోషల్ మీడియాలో అయితే జోహార్ ఎన్టీఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ మారు మ్రోగిపోయింది.అద్బుతమై స్పందనతో నందమూరి కుటుంబ సభ్యులు కూడా చాలా మురిసి పోయారు.ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ కు తమదైన శైలిలో ఘన నివాళి అర్పించడంతో పాటు సాదారణ జనాలు సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్ ఫోటో లను షేర్ చేసుకుంటూ.వారి వారి సోషల్ మీడియా స్టోరీలు గా పెట్టుకుని జోహార్ ఎన్టీఆర్ అంటూ నినదించారు.
వందేళ్ల ఘన కీర్తికి ఇవే మా తరపున నివాళ్లు అంటూ లక్షల మంది సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియో లు రోజంతా వైరల్ అవుతూనే ఉన్నాయి.ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ తో ఏదో ఒక సందర్బం లో టచ్ అయిన వారే ఉంటారు.ఆయన సినిమా లు లేదా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన పథకాలు ఇలా ప్రతి ఒక్క విషయం లో కూడా అద్బుతమైన చరిత్ర ఆయన సొంతం.అందుకే ఆయనకు ఇవే మా జోహార్లు.